58
భారత దేశమున
ఇతడు వచ్చునప్పటికి ఐరోపాలోగాని, భారతదేశమునగాని ఆంగ్లేయుల పరిస్థితులు బాగుగా లేవు. ఐరోపాలో ఫ్రెంచి విప్లవమున ఆంగ్లేయులు యుద్ధమున మునిగిరి. భారతదేశమున ఇంగ్లీషువారికి చిరకాలమునుండి స్నేహితుడుగా నుండిన నైజాము ఫ్రెంచివారి స్నేహము నపేక్షించి తన సైన్యములకు ఫ్రెంచి యుద్యోగులచేత శిక్షణము చేయించుచుండెను. సింధియా రాజుగూడ ఇట్లు చేయుటయే గాక ఫ్రెంచిసేనలనే తన సంస్థానమున నుంచుకొనెను. ఐరోపాలో ఫ్రెంచివారికిని ఆంగ్లేయులకును యుద్ధములు జరుగుచుండుటయు, నెపోలియ౯ ఖ్యాతి భారతదేశమున వ్యాపించుటవలన నితనిని ఈజిప్టుమార్గమున హిందూ దేశమునకు వచ్చి యీ యాంగ్లేయులను వెడలగొట్టవలసినదని ఆంగ్లేయులతో విరోధించియున్న టిప్పుసుల్తాను నెపోలియసు కాహ్వానము లంపెను. ఈ పరిస్థితులలో ఆంగ్లేయుల గౌరవము తగ్గిపోయి ఫ్రెంచివారి గౌరవము హెచ్చుచుండెను. వెల్లస్లీ యీ పరిస్థితులు చూచి ఆంగ్లేయుల పలుకుబడిని హెచ్చించుటకు మార్గము లాలోచించినాడు. దిగ్విజయముచేసి జయించుట కలలోనివార్త. అందువలన చాణక్య నీతిప్రయోగింప దలచినాడు. స్వదేశరాజులతోమంచి మాటలాడి వారితో సంధిచేసికొని ఆసంధిషరతులందు బ్రిటిషు వారిపలుకుబడికి కావలసినకట్టుబాటులు చేయదలచినాడు.స్వదేశ స్వాతంత్ర్యమును కాపాడుటకును ఇతరులతో యుద్ధము కలిగిన వారికి భయములేకుండగ నుఁడుననిచెప్పి బ్రిటిషు సైన్యముల నుంచుకొనుట మంచిదని నయమునను, భయమునను, కొందరిని