బ్రిటీష్‌రాజ్యతంత్రము
297
రాష్ట్రమునగూడా కార్యాలోచనసభ యేర్పడెనుగాని లెఫ్‌టినెంటు గవర్నరుల పరగణాలకట్టివిలేవు. ఈచట్టము చేయబడిన పిదప గవర్నరు జనరలు కార్యాలోచనసభలో నొక భారతీయుని గూడ నియమించి మితవాదులను సంతుష్టిపరచిరి. ఈ ఉదేశ్యముతోనే ఇండియా రాజ్యాంగ కార్యదర్శి ఆలోచనసభకు ఇరువురు భారతీయులు నియమింపబడిరి. మఱియు మదరాసు బొంబాయిరాష్ట్ర గవర్నరుల కార్యాలోచన సభలయందుగూడ నిట్లే ఒక్కొకభారతీయ సభ్యుడు నియమింపబడెను.
సంస్కరణల స్వభావము: ఈ మార్పులను చేయుటలో పార్లిమెంటరీ ప్రజాప్రభుత్వ పద్ధతులను గాని, బాధ్యతాయుత ప్రజాప్రాతినిధ్య స్వపరిపాలనమును గాని భారతీయుల కొసగు తలంపు బ్రిటీషువారి కెన్నడును లేదు. ఈ మార్పువలన అట్టి పరిణామము గలుగునని తోచినచో వారీ సంస్కరణములను గావించియుండరు. దేశములో ప్రభుత్వముపట్ల విరోధభావము ద్వేషభావము ప్రబలి అరాజకవిప్లవోద్యమము నుదయించి చెలరేగుచున్నందున వానిని అరికట్టుటకును నిర్బంధవిధానముతో పాటు దేశములో ప్రభుత్వముసకు తోడ్పడగల శక్తులనెల్ల నేకముజేసి ప్రభుభక్తిపరులను చేరదీసి భారతదేశ నిరంకుశ ప్రభుత్వము నింకను బలవంతముగా జేసికొనవలెననియే వారి యుద్దేశ్యము. అందుకొరకు గావలసిన కట్టుబాటులనెల్ల గావించుకొనిరి. ఈ రాజ్యాంగమువలన ప్రజాప్రతినిధులకెట్టి హక్కులును కలుగలేదు. ఎట్టిహక్కులు కలిగింపవలెననియు వారి యభిమతము