పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/786

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

భారతదేశమున


హారములను గూర్చిన చర్చలు చేయరాదు. విదేశవ్యవహారములు స్వదేశసంస్థానములు కోర్టునిర్ణయములు వీనినిగూర్చియు చర్చింపరాదు. ప్రజాక్షేమమునకు విరుద్ధమనిగాని 'రాష్ట్రశాసనసభలోనే ప్రవేశపెట్టబడవలెననిగాని' అధ్యక్షు డే తీర్మానమునైనను ద్రోసి వేయవచ్చును. తీర్మానములు సవరణచేయబడవచ్చును. ఇట్టి తీర్మానములు శాసనసభవా రామోదించినను కేవలము సలహాలుగానే యుండునుగాని ప్రభుత్వము శిరసావహించవలెనను నియమములేదు.

(iv) విదేశవ్యవహారములు సంస్థానములు కోర్టుతీర్పులను గూర్చిన విషయములుగాక తక్కినవిషయములను గూర్చి శాసనసభలో సభ్యులు ప్రశ్నలువేయుటకు అధికారమివ్వబడెను. వానినిగూర్చి ఇంకను అదనపుసవాళ్లను ఇతరసభ్యులు వేయవచ్చును. అయితే వీనికి ప్రభుత్వసభ్యుడు జనాబు చెప్పవలెనను నిర్బంధములేదు. దీనిని త్రోసివేయుటకుగూడ అధ్యక్షుని కధికారముకలదు. రాష్ట్రశాసనసభలకుగూడ ఇట్టి అధికారమే యివ్వబడెను. ఈశాసనసభలందు జరుగు చర్చల కాలమును తగ్గించుటకుగూడ అధ్యక్షున కధికారమివ్వబడెను.

కార్యనిర్వాహకసభలు:-

1909 వ సంవత్సరవు చట్టమువలన మదరాసు బొంబాయిరాష్ట్రములందు కార్యనిర్వాహక సభలందు నలుగురుసభ్యులు నియమింపబడునట్లు ఏర్పాటు చేయబడెను. ఈసభకు నియమింపబడువారిలో నిరువురు 12 సంవత్సరములు అనుభవముగల ఉద్యోగులుండవలెనను నియమముచేయబడెను. వంగ