పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/785

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

295


రివిన్యూఅను పద్దు క్రింద స్టాంపులు సుంకములు విధింపబడిన పన్నులు, కోర్టులు; ఖర్చుపద్దుక్రింద అసైన్మెంటులు కంపెన్సేషనులు ఋణముపైన వడ్డీ; మత వ్యవహారములఖర్చు; ప్రభుత్వరైళ్ళను గూర్చియు చర్చింపరాదు. గవర్నరు జనరలు లా ప్రకారము చేయవీలులేని వ్యవహారములనుగూర్చియు చర్చింపరాదు. విదేశవ్యవహారములు సంస్థాన వ్యవహారములు చర్చింపరాదు. శాసనసభ అధ్యక్షు డే తీర్మానమునైనను ప్రబాభిప్రాయమునకు విరుద్ధమని త్రోసివేయవచ్చును; లేదా రాష్ట్రసభలో చేయబడవలెననియు త్రోసివేయవచ్చును.

(ii) రాష్ట్రీయద్రవ్య వ్యవహారములను గూర్చి యిట్లు జరుపబడుచుండును. గవర్నరు శాసనసభలో బడ్జెటు ప్రవేశపెట్టబడగానే రాష్ట్రములకు సంబంధించిన 5 వేల రూపాయిలకు పై బడిన ఖర్చులనుగూర్చి రాష్ట్రీయశాసనసభలోని ప్రతినిధిసభ్యులును ఉద్యోగులును చెరిసగముగా నుండు కమిటీలు దానిని పరిశీలించును. తరువాత నిది గవర్నరుజనరలు ప్రభుత్వమున కంపబడి పెద్దబడ్జెటు పట్టికలో చేర్చబడి పైన చెప్పబడిన విధముగా చర్చింపబడును. పైన చెప్పబడిన సందర్భములో రాష్ట్రశాసనసభలకు ద్రవ్యవ్యవహారములను చర్చించు అధికారము గూడ లేదని తేలుచున్నది.

(iii) ప్రజాక్షేమమునకు సంబంధించిన విషయములను గూర్చి శాసనసభలందు తీర్మానములు ప్రవేశపెట్టుటకుగూడ అధికారము గలిగింపబడెను. అయితే గవర్నరుజనరలు సభవారు ఆశాసనసభకు శాసనముచేయుట కధికారములేని వ్యవ