294
భారతదేశమున
తోటలవారికి ఒసగబడెను. మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గము నేర్పరుపబడెను. ఇట్లు విడదీసి పాలించు పద్ధతి శాసనసభలో నెలకొల్పబడెను. మదరాసు బొంబాయి శాసనసభలందు మొత్తముసభ్యులు 50 మంది యుండవచ్చును. పంజాబు బర్మాలలో 30 మంది; అందులో ముగ్గురు గవర్నరులయొక్క కార్యనిర్వాహక సభ్యులు, 21 మంది నియామక సభ్యులు. దీనిలో 16 మంది ఉద్యోగులు, 2 నిపుణులు, 21 మంది ఎన్నుకొనబడు ప్రతిధులు నుందురు. వంగరాష్ట్రమున 28 మంది ఎన్నుకొనబడు ప్రతినిధులు 20 మంది నియామకులు 2 మంది నిపుణులు 3 గ్గురు కార్యనిర్వాహక సభ్యులు నుందురు.
శాసనసభలఅధికారములు:
(i) ప్రభుత్వముయొక్క (ఫైనాన్షియల్ ) ద్రవ్యవ్యవహారముల అంచనాను ముందుగా గవర్నరు జనరలు శాసనసభలో ప్రవేశపెట్టుదురు. అంతట శాసన సభలోని ఏ సభ్యుడైనను ఆ అంచనాలోని పన్నులవిధానములో మార్పునుగూర్చి క్రొత్త రుణములను రాష్ట్రములకిచ్చు గ్రాంటులనుగూర్చిన సంస్కరణ తీర్మానములును ప్రవేశపెట్టవచ్చును. అంతట ప్రభుత్వసభ్యులు సంజాయిషీ చెప్పుదురు. ఈ శాసనసభచేయు తీర్మానములు కేవలము సలహాలేగాని ప్రభుత్వము అమలుజరిపితీరవలసిన నిర్బంధమలేదు. తరువాత ఫైనల్ బడ్జెటు (ఆదాయ వ్యయపట్టిక) ప్రవేశపెట్ట బడినప్పుడు దానిని చర్చించవచ్చునేగాని దానినిగూర్చి ఏ తీర్మానమును ప్రవేశ పెట్టరాదు. సైనిక రాజయరాష్ట్రీయ వ్యవహారములను గూర్చి చర్చించరాదు.