పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

293


మింటోమార్లే రాజ్యాంగసంస్కరణలుచేసిన మార్పులు : -

1909 వ సంవత్సరపు క్రొత్తచట్టమువలన శాసనసభల నిర్మాణమునందు ముఖ్యమైనమార్పులు చేయబడెను. గవర్నరుజనరలుసభలో పూర్వము సభ్యులసంఖ్య 16, ఇప్పుడు 60 మందికి వృద్ధిచేయబడెను. ఈసభ్యులలో కొందరు గవర్నరు జనరలు నియమించినవారు; కొందరు రాష్ట్రశాసనసభలలోని ప్రజాప్రతినిధులెన్నుకొనిన సభ్యులు నుందురు.

1912 లో మరికొన్ని సంస్కరణములు చేయబడగా ఈ 60 మందిలో గవర్నరుజనరలు కార్యాలోచన సభలోని 6 మంది సభ్యులును ఆశాసనసభ సమావేశమగు రాష్ట్ర ప్రభుత్వాధ్యక్షుడును సర్వసేనానియుగాక ఇంకా 33 మంది నియామకసభ్యులు నుందురు. వీరిలో 28 మంది ఉద్యోగులు 5 గురు ఇతరులు కలరు. రాష్ట్రశాసనసభ్యులలోని ప్రజాప్రతినిధు లెన్నుకొన్నవారు 6 మంది, మహామ్మదీయు లెన్నుకొన్నవారు 5, మహమ్మదీయ జమీందారుల ప్రతినిధి యొకడు, వర్తకసంఘము (చేంబర్సు ఆఫ్ కామర్స్) ఎన్నుకొన్నవారు 2 – ఇట్లు ఈ సభలో ప్రజాప్రతినిధులకన్న నియామకులగు ఉద్యోగసభ్యులే హెచ్చుమందిగా నుండిరి. మఱియు ప్రత్యేక నియోజకవర్గముల వలన ఎన్నుకొనబడినవారు పరస్పర విరోధులుగ నుందురు. గవర్నరుజనరలుప్రభుత్వమువారి నిరంకుశాధికారమున కెట్టి లోపము నుండదు. రాష్ట్రశాసనసభలకు ప్రతినిధుల నెన్నుకొనుహక్కు మునిసిపాలిటీలకు జిల్లాబోర్డులకు జమీందారులకు వర్తకసమ్మేళనములకు తేయాకు కాఫీ.