Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

281


ఆంగ్లేయులు భారతీయులుగల ఈ పెద్ద చిన్న యుద్యోగముల యొక్క తారతమ్యము అప్పటికి నిప్పటికి నొకేతీరున నున్నది.

1913 ఏప్రిలులో కేంద్ర, రాష్ట్రీయ ప్రభుత్వముయొక్క వివిధశాఖలందలి ఉద్యోగులలో (ఆంగ్లోఇండియనులు సహా) బ్రిటిషువారును, భారతీయులును ఈ క్రింది దామాషా ప్రకారముండిరి:-

నెలకు రు 200-0-0 ల జీతముగల ఉద్యోగులసంఖ్య ఆ నాటికి 11064. దీనిలో ఆంగ్లో ఇండియనులు బ్రిటిషువారు 6491 మంది అనగానూటికి 59. భారతీయులు 4573 అనగా నూటికి 41. ఇంకను కొన్ని తప్సీళ్లు ఈక్రింద నొసగబడినవి:-

నెల 1కి జీతము రూపాయలు ఆఉద్యోగములలో నూటికెందరు ఇంగ్లీషువారు? నూటి కెందరు భారతీయులు నూటికెందరు ఆంగ్లో ఇండియనులు
200 - 300 12% 64% 24%
300 - 400 19% 62% 19%
400 - 500 36% 49% 15%
500 - 600 58% 31% 11%
600 - 700 54% 36% 10%
700 - 800 78% 14% 8%
800 - 900 73% 21% 6%
900 - 1000 92% 4% 4%

ఇది ప్రొఫెసర్ కె. టి. షా గారి లెక్క

(Sixty years of Indian Finance. Page. 121)