280
భారతదేశమున
1833 వ సంవత్సరపు చట్టము ప్రకారము నియమింపబడిన లా మెంబరగు మెకాలేకు సాలుకు పదివేల పౌనులును 'లాకమిషనరు'గా నతనికి సాలుకింకను ఐదువేల పౌనులును జీతముగా నిర్ణయింపబడెను. ఈయదృష్టము పట్టునాటి కిత డింగ్లాండులో సాలుకు రెండువందల పౌసులు సంపాదించుకొనుచుండెను! సుప్రీముకౌన్సిలుసభ్యునిజీతము 1853లో సాలుకు 80 వేల రూపాయిలుగా నిర్ణయించిరి. లెజిస్టేటీవ్ శాసన నిర్మాణ కార్యాలోచన సభ్యుని జీతము నెల 1కి రు 4166-10-8 లుగ నిర్ణయించిరి. ఆ నాడు సాదరుకోర్టు చీఫ్ జడ్జికి సాలు 1 కి 48 వేల రూపాయిల జీతముండవలెనని సిఫారసు చేసియుండిరి. ఆనా డేశాఖలో చూచినను ఆంగ్లేయులే ఉద్యోగులుగా నుండినందున ఆ యుద్యోగముల కిట్లత్యధికజీతములు నిర్ణయింపబడుచుండెను. చిన్నజీతముల "నేటీవు” ఉద్యోగవర్గముయొక్క నియామకమునకు పార్లిమెంటువా రెట్టి ఏర్పాటును చేయలేదు. అందువలన వీరికెట్టి హక్కులులేవు. ఈ అత్యల్పపు జీతగాండ్రసంఖ్యకు లెక్కలేదు. కొంచెము పెద్దజీతగాండ్రుకూడ కొంతమంది 1835 తరువాత నియమింపబడిరి. గాని ఈ ఉద్యోగములన్నియు ఇండియాలోని ప్రభుత్వమువారి దయాధర్మములపైన నాధారపడి యుండెను. 1861 లో చేయబడిన సివిలుసర్వీసు చట్టము ప్రకార మప్పటికి నిర్మింపబడియున్న ఆంగ్లేయుల పెద్దయుద్యోగవర్గములతో పాటు 'నేటివు' ఉద్యోగుల చిన్న యుద్యోగములనుకూడా ప్రభుత్వమువారు మంజూరుచేసిరి.