Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

53

ఈ యుద్ధములందును, ఫ్రెంచివారితోడి సామదానభేదదండోపాయ ప్రయోగములందును, ఆంగ్లేయుల కీ దేశములోని రాజులయొక్కయు నవాబులయొక్క యు స్నేహసహాయము లనసరములయ్యెను. ఇదియే వివిధసంస్థానములతోడి సంధి యొడంబడికలు చేయుట ప్రారంభించుటకు గారణమయ్యెను. ఈ సందర్భమఃన నాంగ్లేయులు తమకు సాయముచేయు స్వదేశ రాజులను నవాబులను స్వతంత్రరాజులుగా గౌరవించుచు వారి యడుగులకు మడుగులొత్తి యుద్ధములందు సంపాదింపబడిన రాజ్యభాగములను వారికిచ్చి తాము ఒదిగి యుండుచుండిరి.

మైసూరు యుద్ధములైన పిదప జయింపబడిన రాజ్య భాగములందు కొన్నిటిని హైదరాబాదునైజాము కిచ్చిరి. నైజాము ఆంగ్లేయులతో శాశ్వతముగా స్నేహముగ నుండి వీరికి సహాయముచేయుచు తనరాజ్యమును సుఖముగా పరిపాలించు కొనునట్లు వీరికి ఒడంబడిక సంధిజరిగెను. హైదరాలీ తొలగించిన పూర్వపురాజకుటుంబమునకు మైసూరును మరల నిచ్చునపుడు తిరువాంకూరు కొచ్చిను సంస్థానముల వలెనే రక్షితరాజ్యము (ప్రొటెక్ట రేటు) గా చేయబడెను. కర్నాటక నవాబు నధికారవిహీనునిగ జేసి 1801 వరకు పేరునకుమాత్రము నవాబుగా నుంచి తరువాత అదియులాగివేసిరి. ఇట్లే ఉత్తరమున అయోధ్యవిషయమునను జేసిరి. దేశములోని రాజులు నవాబులు నెల్లరు పేరునకు ఢిల్లీచక్రవర్తికి లోబడినవారేగాని నిజముగా స్వతంత్రులై వర్తించు చుండిరి. దక్షిణాపథమున మహారాష్ట్రులు విజృంభించి దేశములోని పరిపాలకుల నుండి