276
భారతదేశమున
ఆదాయము కంపెనీప్రభుత్వకొలువులో పనిచేయు సివిలు మిలిటరీయుద్యోగులలో జబ్బుపడిగాని అపాయములవలన అశక్తులై గాని అసహాయు లైనవారికిని వారికుటుంబములకును ఆకస్మిక మరణములందు వారియొక్క భార్యాబిడ్డలకును కొంత ద్రవ్య సహాయము చేయుటకు వినియోగింపుడని కంపెనీవారి వశముచేసెను. ఈ ధర్మనిధికి "క్లైవు ఫండు" అని పేరువచ్చినది. తమ ఉద్యోగులకు తగుసహాయము చేయు బాధ్యత కంపెనీప్రభుత్వము వారికిగూడ కలదు. కాబట్టివారిసొమ్ముకునూటి కెనిమిదివంతుల చొప్పున అదనముగా సొమ్ముకలిపి వృద్ధిచేసేరి. తరువాత భారతదేశ ఉన్నతోద్యోగులకు; ఐ. సి. ఎస్; మిలిటరీ; యుద్యోగులకు; వారివితంతువులకు, పిల్లలకు, వేరువేరు నిధులును కటుంబ పింఛనుల నిధులు నేర్పరుపబడి ఉద్యోగుల జీతములనుండి ప్రతినెలకు నీనిధులకుకొంతసొమ్ము చేర్చుచుందురు. ఇట్లు కోట్లకొలది రూపాయిలీనిధికిచేరెను. పార్లిమెంటు తనిఖీక్రింద కంపెనీ ప్రభుత్వమువారే ఈధర్మనిధిని చక్కగా నిర్వహించుచుండిరి. 1858 తరువాత ఇండియా ప్రభుత్వము ఈ బాధ్యత వహించెను. ఇంగ్లాండులో వడ్డీ రేటు చాలా చౌకగానున్నందున శాశ్వతముగా నీనిధిపైన సాలుకు నూటి కైదు చొప్పున, మారకము రేటుతో నిమిత్తములేకుండా వడ్డీనిచ్చుబాధ్యత ఇండియా ప్రభుత్వముపైన వేయబడెను. ఈ సొమ్ము ఇంగ్లాండులోని ఉద్యోగుల కుటుంబములకు సక్రమముగా చెల్లింపబడుచున్నది. దీనిలాభములు ఐ. సి.యస్. వగైరా ఉద్యోగములలోని భారతీయులకు పూర్తిగా చెందకుండ వారికి వేరేఏర్పాటులు, చేయుచు కొన్నినిబంధనలుకూడ చేయబడినవి.