Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

275


సాలున భారతదేశప్రభుత్వ మిచ్చుచుండును. ఈ ఫండు యొక్క వివిధ ధర్మనిధుల నిర్వహణమునుగూర్చి నూతన ఇండియా రాజ్యాంగ చట్టముయొక్క 273 వ సెక్షనులో కొన్ని కట్టుదిట్టములు చేయబడినవి. దీనినిగూర్చి ఇంకను కొన్ని బందోబస్తులు చేయుచు సభాయుతుడగు ఆంగ్లరాజు ఆర్డర్ ఇన్ కవున్సిలుజారీచేయుట కధికారమివ్వబడినది. ఆప్రకారమొక ఆర్డరుకూడా ఇటీవల జారీచేయబడినది. ఈ ఫండు వడ్డీలోనుండి ఈ ఉద్యోగుల కుటుంబముల కివ్వబడు ఉపకార విరాళములు, వేతనములను గూర్చి తగు నిబంధనలు చేయబడి అమలు జరుపబడుచున్నవి.

ఈ సివిలు మిలిటరీ ఆఫీసర్ల కుటుంబముల పింఛనుఫండు యొక్క పుట్టుక చరిత్ర చాలా చిత్రమైనది. బ్రిటిష్ రాజ్యతంత్ర ప్రారంభమున మొగలాయి రాజప్రతినిధియు వంగరాష్ట్ర నవాబు నగు సురాజద్దౌలాపట్ల ద్రోహముచేసి క్లైవు అమితధనము లంచముగా గైకొని మిర్జాఫరును వంగరాష్ట్రనవాబుగ జేసియుండెను. క్లైవు 1765 లో మూడవసారి గవర్నరుగా వచ్చుచున్న సంగతి మీర్జాఫరు తెలిసికొని తన యవసానము సమీపించుచున్నందునను, తన కొమారునకు క్లైవు సహాయము చేయగలడను నాసతోను, క్లైవుకు 70 వేల నవరసులు చెందజేసి మీర్జాఫరు చనిపోయెను. అప్పటికే అన్యాయ విత్త సమార్జన మెంతయోజేసెనని క్లైవుపైన నింగ్లాండులో నేరము లారోపింపబడియుండెను. అందువలన నతడీ సొమ్మును స్వప్రయోజనముకొర కుపయోగించుకొనుటకు జంకి ఈ సొమ్మునొక ధర్మనిధిగా నేర్పరచి దానిపైన వచ్చిన