పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/764

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

భారతదేశమున


వారు చెప్పియున్నారు. దీనికి రాష్ట్రీయప్రభుత్వములును రైళ్ల శాఖయు తమఉద్యోగుల కిచ్చుదానితో కలిపినచో నీపద్దు మాత్రమే సాలుకు 5 కోట్ల రూపాయిలగును. ఈబత్తెములలో నిటీవల కొంతతగ్గింపు చేసినను ఆయంకెలలో నిప్పుడుగూడ హెచ్చుతేడాయుండదు. ఈబత్తెములలో ఉద్యోగులు చాలసొమ్ము మిగుల్చుకొను చుండుట జగద్విఖ్యాతము. ఇదిగాక ఇంటిఅద్దెఅలవెన్సు, హెడ్క్వార్టర్సు అలవెన్సు, లోకల్ అలవెన్సు, గ్రెయిన్ కంపెన్సేష౯ అలవెన్సు, పెండ్లి అలవెన్సు, స్పెషల్ ఉద్యోగములందలి స్పెషల్ జీతములు ఇంక నెన్నో సౌకర్యములు వారికి కలవు. -

vi

సివిలు మిలిటరీ ఉద్యోగుల 'కుటుంబముల పింఛనుపండు'

ఐ. సి. ఎస్. వగైరా పెద్దజీతములుగల ఉద్యోగశాఖలకు వారి కివ్వబడు పెద్దపింఛనులుగాక ఇతరఉద్యోగులకు లేని కొన్ని ప్రత్యేకసౌకర్యములు వీరికికలవని ఇదివరకే చెప్పి యున్నాము. 'సివిల్, మిలిటరీ ఉద్యోగుల 'కుటుంబ పింఛనుల ఫండు' అనబడునిధి వీరికొరకు చిరకాలముక్రిందట స్థాపింపబడినది. దానిలో నాలుగువిధములైన నిధులుకలిసియున్నవి. ఈయుద్యోగుల జీతములలోనుండి నెల కింతయని కంట్రిబ్యూషను పుచ్చుకొని దానికి మనప్రభుత్వము కొంతకలిపి యీఫండును వృద్ధిచేయుచుండును. ఇది పెరిగిపెరిగి నేడు 120 లక్షల పౌనులు - (సుమారు 18 కోట్ల రూపాయిలు) అయినది. దీనిపైన సాలుకు నూటికైదుచొప్పున అయినవడ్డీ 90 లక్షలరూపాయిలు ప్రతి