Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

భారతదేశమున


రాజ్యాంగకార్యదర్శియే నియమించును. ఇదిగాక దేశరక్షణ( సైనిక) శాఖ, విదేశవ్యవహారములు; మతవ్యవహారములు నింకను గవర్నరు జనరలు స్వతంత్రవివేచనలోని ఇతరశాఖలకు అవసరమైన ఉద్యోగవర్గములనుగూడ రాజ్యాంగ కార్యదర్శియే నియమించును. మరియు భారతదేశ ప్రభుత్వయంత్రము నందు “రిజర్వుడు" ఉద్యోగములు కొన్ని రాజ్యాంగకార్యదర్శియె. నిర్మించును. రాజ్యాంగకార్యదర్శి నియమించు ఉద్యోగవర్గములయొక్కయు ఉద్యోగుల యొక్కయు ఉద్యోగషరతులు, వారి జీతములు, పింఛనులు, అలవెన్సులు, ప్రమోషనులు అన్నియు అతనిచేతులలోనేయుండును. మంత్రులకెట్టి అధికారమునుండదు. రాష్ట్రములందు సామాన్యవిషయములందు కూడా ఈ ఐ. సి. ఎస్. వగైరా ఉద్యోగులు మంత్రులమాటలు విననిచో వారు చేయునది యేమియులేదు. ఈ ఉద్యోగులకు కొన్నిశాశ్వత హక్కులు దానశాసనముగా చట్టములోనే వ్రాసి యివ్వబడినవి. వీరికింకను క్షేమలాభములు కలిగించు నిబంధనలు. ఆర్డర్లు ప్యాసుచేయుటకు రాజ్యాంగకార్యదర్శికి ఆంగ్లరాజుకు, అధికారమివ్వబడినది.

ఈ క్రొత్త రాజ్యాంగ చట్టమువలన ఈ ఉద్యోగులకు పూర్వమునుండియున్న అత్యధిక జీతములందుగాని అలవెన్సు లందును ఇతర సౌకర్యములందు గాని, ఎట్టి మార్పును చేయబడలేదు. ఈ ఉద్యోగులకు వ్యతిరేకముగా పజూప్రతినిధి శాసనసభలు మంత్రులు నెట్టి మార్పులు చేయుటకును వీలులేదు. ఐ. సి. యస్. వర్గములోని ప్రతి ఉద్యోగియొక్క.