52
భారత దేశమున
ణాపథమున నవాబులలో నెవరో యొకరిపక్షమున జేరి గొప్ప పలుకుబడి సంపాదించుట లాభముపొందుటయు చూచి ఆంగ్లేయులు నిది ప్రారంభించిరి. 1744 లో నింగ్లాండుపైన ఫ్రెంచిదేశము యుద్ధము ప్రకటించినది. 1748 లో సంధి జరిగెను గాని ఆ సమయమున మనదేశములో నీ రెండు దేశముల వర్తకులకు రగుల్కొనిన యుద్దకీలలు ఆరక ప్రజ్వలించుచునే యుండెను. 1756 లో నైరోపాలో మరల యుద్దముతటస్థించి 1763 వరకు జరిగినది. ఈ సందర్భములో ఫ్రెంచివారు భారతదేశమున తమబలముల నుపేక్షించుటవలన నైజాముదగ్గఱ వారి పలుకుబడి తగ్గిపోయి ఆంగ్లేయులపలుకుబడి హెచ్చినది. ఈ సమయముననే ఆంగ్లేయులు అతనివలన ఉత్తరసర్కారులు సంపాదించిరి. 1665 లో దీనిని స్థిరపరచుచు ఢిల్లీ చక్రవర్తి ఫర్మానా పొందిరి. 1775 లో అమెరికా స్వాతంత్ర్యయుద్ధ మారంభమై ఇంగ్లాండుకు ఫ్రెంచిదేశమునకు సముద్రయుద్ధముకలిగెను. ఈ సందర్భమున భారతదేశమున మరల నీ కంపెనీలు పోరాడెను. 1783 లో నైరోపాలో సంధిజరిగినను భారతదేశమున కుట్రలుజరుగుచునే యుండెను. ఫ్రెంచిదేశమున ప్రజావిప్లవము కలిగిన పిదప 1793 లో ఫ్రెంచిదేశ మింగ్లాండుపైన మరలయుద్ధము ప్రకటించినది. అంతట ప్రపంచములో వీరాధివీరుడని ప్రసిద్ధిగాంచిన నెపోలియను ఐరోపాలోని రాజ్యములనెల్ల నుఱ్ఱూతలూగించి ఆంగ్లేయులను మూడుచెరువుల నీళ్లుత్రాగించినాడు.