బ్రిటీష్‌రాజ్యతంత్రము
267
చీపుకోర్టున్యాయాధిపతులును తక్కినచోట్లజ్యుడిషియల్ కమీషనర్లునుగలరు. కలకత్తాప్రధాన న్యాయమూర్తికి నె1కి రు6000-0-0 లు జీతము. మద్రాసు, బొంబాయి, అలహాబాదు, పాట్నా, లాహోరు, నాగపూర్ హైకోర్టుల జడ్జీలలోని ప్రధానన్యాయమూర్తులకు నెల 1కి 5000-0-0 లు నాగపురం హైకోర్టు చీఫ్ జడ్జికి రు 4165-0-0 నెలజీతము, తక్కిన జడ్జీలకు నాలుగువేలు. చిన్నరాష్ట్రములలో 3 వేలు నెల జీతములు నిర్ణయింపబడినవి. వీరికి 12 సంవత్సరములలో పూర్తిగా పింఛనుపొందు అర్హతవచ్చును. 7 సంవత్సరములలో దామాషాగా పింఛను వచ్చును. ఈజడ్జీలలో ఐ. సి. యస్. వారున్నచో వారు ఇండియామంత్రితో చేసికొనిన కవనెంటు (ఒడంబడిక)లు ప్రకారము ప్రత్యేకషరతులు వర్తించునని శాసింపబడినది. ఐ. సి. ఎస్ . లో వచ్చు పింఛనుగాక వారికి 7 సంవత్సరముల సర్వీసుకు సాలుకు 100 పౌనులు మొదలు 12 సంవత్సరముల సర్వీసుకు 200 పౌనులవరకు "ఆదనపుపింఛను" ఒసగబడును. ఈ ఐ. సి. యస్. వారికి అకాలబలవన్మరణము కలిగినగాని అపాయమువలన అంగవైకల్యము, దేహపీడ కలిగినగాని “అసాధారణపింఛనులు, ఉపకారవేతనవిరాళములు (గాట్యుయిటీలు) నివ్వబడును. ఏకారణముచేతనైనను అశక్తుడైనచో ప్రత్యేకసెలవు, ప్రయాణఫుఖర్చులు మొదలగు ప్రత్యేక
సౌకర్యములు పొందుటకు అర్హతలుకలవు. ఈనిబంధసలు జడ్జీలకుగూడా వర్తించునట్లు శాసింపబడినది.
ఒకజడ్జి సర్విసులోనుండగా చనిపోయినచో అతనివార