Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/756

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

భారతదేశమున


ii ఫెడరలు కోర్టు జడ్జీలు; హైకోర్టు జడ్జీల:-

క్రొత్తగా స్థాపించిన ఫెడరలకోర్టు చీఫ్ జస్టిసుకు నెలకు ఏడువేలరూపాయిలజీతము. 12 సంవత్సరములైన పిదప సాలుకు 2000 పౌనులవరకు ఫించను. తక్కిన ఇద్దరు న్యాయాధిపతులకు నెలకు జీతము ఒక్కొకరికి 5000 రూపాయిలుగ నిర్ణయింపబడినది. ప్రధాన న్యాయమూర్తి సర్వీసులో నుండగా చనిపోయినచో అతని వారసులకు మూడువేలపౌనుల విరాళము (గ్రాట్యూయిటీ) ఇవ్వబడును. (అతడు సీమనుండి బయలుదేరగానే పనిలో చేరినట్లే ఎంచబడును.) రిటైరైన ఒక సంవత్సరములోపుగా చనిపోయినచోగూడ అతని వారసులకు 3 వేల పౌనులలో అతనికి ముట్టిన సొమ్ముపోను మిగతాసొమ్ము ఇవ్వబడును. తక్కిన జడ్జీలలో ఐ.సి.యస్ . ఉద్యోగియున్నచో అతనికి ఐ. సి. యస్. నిబంధనలే వర్తించి అతనికి ప్రత్యేక సౌకర్యములుండును. అతడు సీమనుండి బయలు దేరుటకు 500 పౌనులు సరంజాము (ఎక్విప్‌మెంటు) ఖర్చులును ఇదిగాక ప్రయాణపుఖర్చులు నివ్వవలెను. ఈ దేశములో గూడా ప్రయాణపు ఖర్చులివ్వబడును. ఐ. సి. యస్. వర్గమువారు గాక ఇతర రకముల జడ్జీలనుగూర్చిన నిబంధన లింకను ప్రకిటింపబడలేదు.

వివిధ హైకోర్టుజడ్జీల విషయములోగూడా ఒకరాజాజ్ఞ జారీచేయబడినది. మద్రాసులో 15 జడ్జీలు, బొంబాయిలో 13, కలకత్తాలో 19, అలహాబాదులో 12, లాహోరులో 15, పాట్నాలో 11,నాగపూరులో 7గురుజడ్జీలుగలరు. అయోధ్యలో