ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
265
నివ్వబడును. రు 5500 వరకు హెచ్చించుటకు ఇండియారాజ్యాంగ కార్యదర్శికధికారముకలదు. గవర్నరులస్వంత ఉపయోగము నిమిత్తము దిగుమతిచేయు ఆహారపానీయములకు దుస్తులకు ఇతరవస్తువులకు మోటారులకు పైన సుంకములుండవు. ఇట్లే గవర్నరు జనరలుకుగూడ ఏర్పాటుచేయబడినవి. అతని ఉద్యోగ అలవెన్సు సాలుకు 15 లక్షల రూపాయలుగా నిర్ణయింపబడినది.
ii కొన్ని పెద్దయుద్యోగములు - వానిజీతములు:-
సర్వసేనానికి నె 1 కి జీతము | రు. 8333-0-0 | |
ఎగ్జిక్యూటివు కౌన్సిల్ సభ్యులకు ఒక్కొక్కరికి | 6666-10-8 | |
అండమాను నికోబారుదీవులఛీఫ్ కమీషనరుకు | 3000-0-0 | |
బెలూచిస్థాన గవర్నరుకు | 4000-0-0 | |
కూర్గుకమీషనరుకు | 4000-0-0 | |
ఢిల్లీకమీషనరుకు | 3000-0-0 | |
వంగరాష్ట్రఛీఫ్ సెక్రటరీకి | 5333-5-4 | |
మద్రాసుఛీఫ్ సెక్రటరీకి | 3750-0-0 | |
బీహారు బొంబాయి పంజాబు సంయుక్తరాష్ట్రముల ఛీఫ్ సెక్రటరీలకు | 3000-0-0 | |
మధ్యరాష్ట్ర ఛీఫ్ సెక్రటరీకి | 2200-0-0 | |
ఒరిస్సా | 2150-0-0 | |
డివిజనల్ కమీషనర్లకు ఒక్కొకరికి | 4000-0-0 | |
జిల్లాకలెక్టర్లకు ఒక్కొకరికి | 3500-0-0 | |
ఐ. సి. ఎస్. వారిలో హీనపక్షపు జీతము | 450-0-0 |