Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/754

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

భారతదేశమున


లలో ఫర్నిచరు మంచిస్థిలోనుంచుటకు అనిచెప్పి ప్రతిసాలున ఈక్రిందిమొత్తము లాయాగవర్నరు కిచ్చునట్లు శాసింపబడినది.

రాష్ట్రము మొత్తమురూపాయలు
మద్రాసు 575500
బొంబాయి 538400
వంగరాష్ట్రము 606000
సంయుక్తరాష్ట్రము 332330
పంజాబు 141200
బీహారు 108200
మధ్యరాష్ట్రము, బీరారు 107300
అస్సాము 142100
పశ్చిమోత్తర స్సరిహద్దుపరగణా 112850
సింధు 129800
ఒరిస్సా 103000

ఇట్లు ఈ గవర్నరులకు మహారాజులకువలె అన్నిఖర్చులు గొప్పజీతము లివ్వబడునట్లు నిర్ణయింపబడి ఈ సొమ్మంతయు భారతదేశ ఆదాయముపైన బద్ధతచేయు బడినది. అనగా మనవిద్యకు వైద్యమునకు ఇవిపోగా మిగిలిన దానినే ఖర్చు పెట్టికొనవలయును

ఈగవర్నరులు సెలవుమీదవెళ్ళినచో మద్రాసు బొంబాయి వంగ సంయుక్త పంజాబు బీహారు గవర్నర్లు ఆరుమందికి నాల్గువేలచొప్పున సెలవు అలవెన్సులు, మధ్యరాష్ట్రముల గవర్నరుకు రు 3000-0-0 తక్కినవారికి నెలకు రు 2750-0-0 లు