బ్రిటీష్‌రాజ్యతంత్రము
263
క్రిందను, కొన్నివేలరూపాయల అలవెన్సుల నిచ్చుటయేగాక ఇండియాలో వారు తమయుద్యోగ దర్జాలనుబట్టి సగౌరవముగాను సుఖముగాను అధికారము చలాయించుటకు అవసరమైన సొమ్ము యివ్వబడి తగుఏర్పాట్లు గావింపబడుననియు వారి యుద్యోగములయొక్క ఆచారము దర్జా ఇతరసౌకర్యములు వారికొసగబడుననియు అందుకు వలసిన తాఖీదులను ఆంగ్లచక్రవర్తి జారీచేయుననియు చట్టములోనే చెప్పబడినది. చట్టము ప్రకారము ఆంగ్లరాజు ఆర్డర్సు ఇన్ కవున్సిళ్ళను జారీచేసి ఆయారాష్ట్రముల గవర్నరులకు తగు ఏర్పాటులను చేసియున్నాడు. సీమనుంచి బయలుదేరునప్పుడు మద్రాసు బొంబాయి వంగరాష్ట్ర గవర్నరులకు 2000 పౌనులు సంయుక్త రాష్ట్రముల గవర్నరుకు 1800 పౌసులు పంజాబు బీహారు గవర్నర్లకు 1500 పౌనులు మధ్యరాష్ట్రములు పశ్చిమోత్తర సరిహద్దు ఒరిస్సాల గవర్నరులకు 1200 పౌనులు అస్సాము గవర్నరుకు 1100 పౌనులు సరంజాము ఖర్చులక్రింద నివ్వబడునట్లు ఏర్పాటుచేసి, వారికి వారికుటుంబములకు ఇండియాకు వచ్చుటకగు ఖర్చులన్నియు భారతదేశము భరింపవలెననిరి. ఇదిగాక నివాస గృహము అందలిసామానులు ఆఫీసు (కార్యాలయమందలి) ఫర్నిచరు (ఆసనములు వగైరాలు) క్రొతవి కొనుటకును భోజనము సువారము, మిలిటరీ సెక్రటరీ అతని సిబ్బంది, బ్యాండు,, బాడీగార్డు(రక్షకోద్యోగము) పర్యటనములు (టూరింగు) ఖర్చుకు మోటారుకారులువగైరా చిల్లరఖర్చులకు ఆఫీసు కార్యాలయము