Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/750

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

భారతదేశమున


యలుండగా అమెరికామంత్రిమండలిలోని సభ్యులకు నెలకు రు 3412. దక్షిణ డకోటాగవర్నరు నెలజీతము రు 682-0-0. మన ఐ.సి.యస్. ఉద్యోగికన్న తక్కువ. అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రధానన్యాయమూర్తి జీతము నెల 1కి రు 4550. మన వంగరాష్ట్ర న్యాయమూర్తికి నెల 1 కి రు 6000-0-0

బ్రిటిషు సామ్రాజ్యముయొక్క తలమానికమగు ఇంగ్లాండువారిసగటు ఆదాయము తల 1కి 1240. మనకన్న 14 రెట్లు. ఈ దేశప్రధానమంత్రికి నెల 1 కి జీతము రు 11111 మనమద్రాసు గవర్నరుకన్నకొంచెము అధికము. మనగవర్నరు జనరలు జీతముకన్న 10222 రూపాయలు తక్కువ. మన వైస్రాయికి వలె 15 లక్షలరూపాయిల అలవెన్సులేదు. ఇంగ్లాండు క్యాబినెట్టు మంత్రులకు సాలు 1 కి జీతము 5 వేల పౌసులు; అనగా నెల 1 కి 5555 రూపాయిలు. ఇంగ్లాండులోని ఉద్యోగి అత్యుత్తమతరగతికి వచ్చి పర్మనెంటు సెక్రటరీయైనప్పుడు వచ్చు నెలజీతము రు 3333. ఇంగ్లాండులోని సివిలు ఉద్యోగుల సంఖ్య 1140. వీరిలో అధికసంఖ్యాకులకు నెలకు 770 మొదలు 1000 రూపాయిలవరకే జీతము.

కెనడా జాతీయాదాయము మనకన్న 17 రెట్లు అధికము. రివిన్యూ మనకన్న 11 రెట్లు హెచ్చు. ప్రధానామాత్యునికి నెల 1కి 3375 రు. తక్కినమంత్రులకు నెలకు 2250 రూ|| జీతము .