బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
51
సంపాదనకొరకు ప్రాకులాడుచు నిరుగుపొరుగు వారిపై దండెత్తుచు దేశశాంతికి భంగము కలిగించుచుండగా దేశరక్షణ చేయవలసిన కేంద్రమొగలు ప్రభుత్వము అట్లు చేయలేని సమయములో క్రొత్తగా నీ దేశమున వ్యాపారము చేసికొనవచ్చిన విదేశీయవర్తకులు నిర్భయముగను సుఖముగను వ్యాపారముచేసికొనుట దుర్లభమయ్యెను. అందువలన దురాశాపరులును బలవంతులు నగు చిన్నరాజులు, నాయకులు, బందెపోటుదొంగలు తమపైబడి కొల్లగొనకుండ స్వసంరక్షణము కొరకు వీరు సైన్యము లుంచుకొనవలసి వచ్చెను. తమతోపాటు వ్యాపారముచేయు తెల్లవర్తకులతోను యిరుగుపొరుగు స్వదేశ రాజ్యములతోను దెబ్బలాటలు యుద్ధములు తప్పలేదు. బొంబాయి సముద్రతీరములందు సూరతు మొదలగుచోట్ల నాంగ్లవర్తక కంపెనీవారు వర్తకస్థానముల నేర్పరచుకొనిన పిదప అచ్చటి సముద్రతీరపు పరిస్థితులనుబట్టి ఆంగ్లేయులకు సముద్రచోరుల వలననేగాక, తమతో పోటీచేయు పోర్చుగీసు డచ్చి ఫ్రెంచివర్తకుల వలని భయము, మహారాష్ట్ర దండులవలని భయములేకుండా చూచికొనవలసిన అగత్యము కలిగియుండినందున నీ ఉద్దేశముతో, వీరు కొల్హాపూరు, సావంతవాడి, జంజీర, జఫారాబాదు, క్యాంబే మొదలగు సముద్రబలముగల రాజ్యములతో సముద్రచౌర్యమునణచు షరతులుగల సంధిచేసికొనిరి. ఇట్లే పీష్వాతో 1739 లో చేయబడిన సంధియు సముద్రతీర రక్షణకు వాణిజ్యమునకు సంబంధించినది. ఫ్రెంచినాయకుడగు డూప్లే దక్షి