Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

259


యముగల ఆదేశములో జీతములు ఎంత తక్కువగ నున్నవో చూడుడు.

- నెలకు సాలుకు
ప్రధానమంత్రికి రూపాయిలు 622-0-0 (7552)
ఇతరమంత్రులకు రూపాయిలు 440-9-4 (5349 1/3)
శెక్రటరీలు రూపాయిలు 375-12-8 (4562 2/3)
కొరియాగవర్నరుజనరలు రూపాయిలు 440-9-4 (5349 1/3)
ప్రీవికవున్సిలుఛాన్సిలరు రూపాయిలు 427-10-0 (5192)

1934 లో అన్నిరకముల ఉద్యోగులుకలిసి 135692.

అచ్చట మూడుతరగతుల పెద్ద ఉద్యోగులు నాలుగవతరగతి స్వల్పజీతగాండ్రునుగలరు.

మొదటితరగతి పెద్దఉద్యోగులకు నెల 1కి సగటున 334-1-0
రెండవతరగతివారికి నెల 1కి 171-12-3
మూడవతరగతివారికి నెల 1కి 63-10-0

భారతదేశములో సామాన్య ఐ. సి. యస్. ఉద్యోగుల, సగటు జీతము నెల 1కి 1301 రూపాయిగానున్నది.

అమెరికా సంయుక్త రాష్ట్రముల జాతీయాదాయము భారతదేశమునకు 22 రెట్లుగానున్నది. మన ప్రభుత్వాదాయము కన్న 8 రెట్లు రివిన్యూగలదు. ఆదేశ అధ్యక్షునికి ఇంగ్లాండు చక్రవర్తితో సమానగౌరవముకలదు. ఇట్టివాని నెలజీతము 17062. రూపాయలు మనవైస్రాయి కతనికన్నను ఎక్కువ.(రు 21333) ఇకమన ఎగ్జిక్యుటివుకౌన్సిలుసభ్యులకు నెలకి 6667 రూపా