ఈ పుట ఆమోదించబడ్డది
258
భారతదేశమున
ఈఅంకెలను ప్రొఫెసర్ డి. ఆర్. గాడ్గిల్ గారు 1931 లో తయారుచేసినారు. భారతదేశములో 1931 తరువాత ధరలు పడిపోయినందున సగటు ఆదాయము సాలు 1కి 35 రూపాయిలు అయినది. కూలివానికి గుమాస్తాకు పెద్దజీతగానికిగల తారతమ్య మింకను హెచ్చియుండును. మనసగటు ఆదాయము తక్కిన అన్ని దేశములకన్న హీనముగానున్నను, మన దేశములోనున్నంత అత్యధికజీతము లింక నేదేశములోనులేవు. మనకన్న అనేకమడుంగులధిక సంపన్నులుగనున్న జపానుదేశములోని ఉద్యోగుల జీతములతో మన ఉద్యోగులజీతములను పోల్చిచూచినచో మన పరిపాలనలో ఎంతసొమ్ము వృధాగా వ్యయమగుచున్నదో తెలియును.
జపాను జనసంఖ్య 64450005. ఈజనసంఖ్య మన వంగరాష్ట్రమునకు రెట్టింపుగనుండును. జాతీయ ఆదాయము తల 1కి సాలుకు రు 148-11-6 లు.
1935-36 లో జపాను దేశాదాయము.
బడ్జెటుమొత్తము | రూపాయిలు | 1722484236 |
ఆదాయపుపన్ను | రూపాయిలు | 45034664 |
వ్యాపారలాభములపైనపన్ను | రూపాయిలు | 39263744 |
వారసత్వములపైన | రూపాయిలు | 22534856 |
- | వెరసి రూపాయిలు | 106833264 |
భారతదేశముకన్న రెండురెట్లు హెచ్చు జాతీయాదా