Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

భారత దేశమున


మూడవప్రకరణము

స్వతంత్రరాజులు సామంతులగుట

I

స్వదేశసంస్థానములసమస్య

ఆంగ్లేయతూర్పు ఇండియా కంపెనీ పదునేడవ శతాబ్ద ప్రారంభము (1600) మొదలు పదునెనిమిదవ శతాబ్దమధ్య (1757) వరకును కేవలము భారతదేశ స్వదేశరాజులయొక్కయు నవాబులయొక్కయుదయపైన ధర్మముపైన నాధారపడిహాలెండు, ఫ్రెంచిదేశపు వర్తకులతోపాటుపోటీగా నీదేశములో వర్తకము చేసికొనుచు కాలక్షేపముచేయు వ్యాపారసంఘముగా నుండెను. అటుపిమ్మట 1757 మొదలు 1857 వరకు నింకొంక నూరేండ్లు వా రేదేశమున రాజ్యాక్రమణము చేయుచు తాము సంపాదించిన రాజ్యాధిపత్యమును గట్టిపరచుకొనుచు నాంగ్లేయపార్లమెంటు ప్రభుత్వముతో కలసి యీదేశ రాజ్యపరిపాలనాధికారములను చలాయించుచు క్రమక్రమముగా తన వ్యాపార హక్కులను వ్యవహారములను విరమించుకొన సాగెను. 1857 లో జరిగిన భారతదేశ సిపాయిల స్వాతంత్య విప్లవానంతరము కంపెనీవారి కప్పటికి మిగిలియున్న రాజ్య పరిపాలనాధికారములు ఆంగ్లరాజ్య మకుటమునకు ఆంగ్లపార్లమెంటుకు బదలాయింపు చేయబడెను. (Government of India. - Ilbert)

మొగలాయిసామ్రాజ్యము బలహీనమై దానికిలోబడి యుండిన సామంతులు స్వతంత్రులై అధికారముకొరకు రాజ్య