బ్రిటీష్‌రాజ్యతంత్రము
249
అనుబంధముల పరిచ్ఛేదము.
మొదటి అనుబంధము
బ్రిటీషు విద్యావిధానము; వైజ్ఞానిక పారతంత్య్రము.
భారతదేశములోని వివిధభాగములు ఆంగ్లేయులవశమై అందు బ్రిటీషుపరిపాలన స్థాపింపబడు నాటికి దేశములోని పట్టణములేగాక పల్లెలును పాడిపంటలతోను పరిశ్రమలతోను తులతూగుచుండెను. అనాదిసిద్ధములగు ప్రజాపరిపాలనా సంస్థలు, గ్రామపంచాయితీలు నుండెను. సంస్కృతవిజ్ఞానమును బోధించు గురుకులములు గాక హిందూ మహమ్మదీయ జన సామాన్యమునకు చదువను వ్రాయను నేర్పు గ్రామపాఠశాలలు విరివిగా నుండెను. ఇదియంతయు కంపెనీ పరిపాలనలో రూపుమాసినది.
పూర్వమునాటి పరిస్థితులు తూర్పు ఇండియా కంపెనీ కాగితములవలననే తెలియుచున్నవి. 1822 - 26 మధ్యజరిగిన విచారణవలన మద్రాసు రాజధానిలో నానాటికి పాఠశాలలకు పోవు ఈడుగల బాలకులలో దరిదాపుగా ఆరవవంతు మంది ఏదో యొకవిధమగు విద్య గఱచుచుండిరని అంచనా వేయబడినది. ఇట్లే 1823 - 28 మధ్య బొంబాయిలో జరిగిన విచారణలో ఎనిమిదిమంది కొక బాలుడు విద్యనేర్చుచుండినట్లు తేలినది. ఇట్లే వంగరాష్ట్రమున “ఆడం” గారు చేసిన విచారణవలన ఒకజిల్లాలో పురుషులలో నూటికి 13.2 మంది విద్యనేర్చుచుండినట్లు తేలినది. వంగరాష్ట్రమున పురుషులలో