Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/738

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

భారతదేశమున

చున్నానని గవర్నరు తన స్వతంత్ర వివేచన నుపయోగించి శాసనసభాధ్యక్షునికి తెలిపినచో ఆ ప్రశ్న సభాకార్యక్రమమున చేర్చబడదు. చేర్చబడియున్నచో శాసనసభాధ్యక్షుడు దానినడుగనివ్వకూడదు. 116వ నిబంధననుబట్టి గవర్నరు ఏ తీర్మానమునైనను ఆట్లు నిషేధింపవచ్చును. ఇంకొక నిబంధననుబట్టి శాసనసభలోని సామాన్య ఉపపాదనములు అడ్జర్ న్ మెంటు తీర్మానములు కూడా గవర్నరు నిషేధింపవచ్చును. ఇట్లు అసలే యధికారము లేని శాసనసభలకు వాగ్బంధనముకూడా చేయబడుచున్నది. ఈ ఉదాహరణమును బట్టియే క్రొత్తరాజ్యాంగముక్రింద రాష్ట్రీయగవర్నరు లెంతఉదారముగా పరిపాలింతురో తేలుచున్నది.