Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

భారతదేశమున

54 వ సెక్షను గవర్నరు తన స్వతంత్ర వివేచనకు సంబంధించిన విషయములందు గవర్నరు, గవర్నరు జనరలుకే బాధ్యుడై ప్రవర్తింపవలెనని విధించుచున్నది. ఆర్థిక స్వాతంత్ర్య మనగా స్వపరిపాలనము కాదనియు, గవర్నరుజనరలు యొక్కయు, రాజ్యాంగ కార్యదర్శియొక్కయు అదుపు ఆజ్ఞల నుండి విడుదల మాత్రమేయనియు పూర్వము అసెంబ్లీ శాసనసభయొక్క ప్రథమ అధ్యక్షుడు చేసిన తీర్మాన ప్రకటనమునకు గూడ ఇది విరుద్ధముగానున్నది.

ఫెడరలు శాసనములతోగాని రాష్ట్రీయ శాసనములతోగాని నిమిత్తము లేకుండా మినహాయింపబడిన ప్రదేశములను గవర్నరు తన చిత్తానుసారము పరిపాలింపవచ్చునని 92-వ శెక్షను శాసించుచున్నది. రాష్ట్రీయ రాజ్యాంగ వ్యవస్థన్ను రద్దుచేసి ఏరాష్ట్రీయ ప్రభుత్వ సంస్థయొక్క అధికారములనైనను గవర్నరే వహించి చలాయించవచ్చునని 93–వ శెక్షను చెప్పుచున్నది. 1919 నాటి ఇండియా రాజ్యంగచట్టమునుబట్టి కూడ ఇట్టి అధికారములు గవర్నరులు చలాయించి యెరుగరు. ఈ క్రొత్తరాజ్యాంగము మనకు శాసన నిర్మాణమునందుగాని ద్రవ్యమునందుగాని స్వపరిపాలనము నెంతమాత్రము ఒసగుటలేదు. అట్టి అధికారము లివ్వబడినవని చెప్పుట బూటకము.

ప్రజాప్రభుత్వ పద్ధతులకు విరుద్ధముగా ప్రజాప్రతినిధుల పరిపాలనాధికారము శాసననిర్మాణాధికారము సంకుచిత పరుపబడిగవర్నరులకు గవర్నరుజనరలుకు ప్రత్యేక బాధ్యతలు