బ్రిటీష్‌రాజ్యతంత్రము
241
వోటుహక్కు లేకుండపోయినది. దేశపుమొత్తముజనసంఖ్యలో నూటికి 14 వంతులు ప్రజలకు మాత్రమే వోటుహక్కు కలదు. రెండవవిషయము: పైసభలగు కౌన్సిళ్ళు దేశాభివృద్ధి యన్న గిట్టనిఆస్తిపరులతో నిండియుండును. జనసామాన్యముయొక్క ప్రజాప్రతినిధులసభలు ప్రజాప్రభుత్వమునకు, దేశాభివృద్ధికి ఉపయోగించు శాసనముల నేవైన చేయకుండ వానికి కొంత ఆటంకము కలిగించుకొరకు ముఖ్యమైన రాష్ట్రములందెల్ల ఈజమీందారీ ధనికాధీనములగు కౌన్సిళ్లు నిర్మింపబడినవి. మూడవ విషయము: జాతి మత కులములవారీగా నిర్ణయింపబడిన నియోజకవర్గముల వారివలన ఎన్నుకొనబడిన సభ్యులు పరస్పరము పోరాడుకొనుచు ప్రభుత్వము నెదిరింపలేకపోవుదురు.
III
శాసనసభల అధికారములు
లెజిస్లేటివు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన ఏచిత్తుచట్టముగూడ లెజిస్లేటివు కవున్సిలువారివలన తీర్మానింపబడనిదీ శాసనముకాదు. మరియు గవర్నరు ఆమోదింపనిదీ శాసనముకాదు. ఈరెండుసభలకు ఏశాసనమువిషయమైన గాని అభిప్రాయభేదము వచ్చినచో గవర్నరు ఉభయసభలను సమావేశపరచును. అంతట ఆ సంయుక్తసభలో నాశాసనము తీర్మానింపబడినచో ఉభయసభలు తీర్మానించినట్లే ఎంచబడును. ప్రతిచట్టమువిషయములోను తాను దానిని ఆమోదింపక అది శాసనము కాకుండ గవర్నరు దానిని అరికట్టవచ్చును. అతడంగీకరించిన శాసనముకూడ 12 నెలలలో ఆంగ్లనృపాలుడు