పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/730

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
240
భారతదేశమున
 


ప్రతినిధుల నెన్నుకొనుహక్కు హెచ్చు ఆస్తిపరులకుమాత్రమే యుండును. అసెంబ్లీసభకు సామాన్య ఆస్తిపరులు చదువు వచ్చినవారు ప్రతినిధుల నెన్నుకొనవచ్చును.

బెంగాలు లెజిస్లేటివు కవున్సిలులో 65 మంది సభ్యులుందురు. మద్రాసులో 56 మంది యుందురు. అన్నిటికన్న చిన్నదగు అస్సాముసభలో 25 మంది యుందురు. ఈసభలకు కొంతమంది సభ్యులను గవర్నరు నియమించవచ్చును. మద్రాసులో 8 మందిని గవర్నరు నియమించినాడు. బెంగాలులో 27 గురు సభ్యులు, బీహారులో 12 మంది సభ్యులు క్రిందిశాసనసభ వారివలన పైసభకు ఎన్నుకొనునట్లు విధింపబడినది.

లెజిస్లేటివు అసెంబ్లీసభలో బెంగాలులో 250 మంది, మద్రాసులో 215 మంది యుందురు. ఇట్లేతక్కిన పరగణాలలో నుందురు. చిన్నదగు పశ్చిమోత్తర పరగణాల శాసనసభలో 50 మంది యుందురు. ఈసభకు ప్రజలనియోజకవర్గములే ప్రతినిధుల నెన్నుకొనును. అయితే ఎన్నికహక్కు జాతిమతకులవివక్షతల నాధారపరచుకొని ప్రత్యేక నియోజకవర్గముల కివ్వబడిన శాసనసభలలో ఆయా జనసంఘముల ప్రతినిధుల సంఖ్యకూడా నిర్ణయింపబడినది. కొన్ని స్థానములు వర్తకసంస్థలకు కార్మికులకు భూస్వాములకు స్త్రీలకునిర్ణయింపబడినవి. ఇందు ముఖ్యముగా గమనింపదగిన మొదటివిషయము: ఎన్నికలహక్కు ముఖ్యముగా ఆస్తిగలవారికి, చదువుకొన్నవారికి మాత్రమె ఒసగబడుట. అందువలన నిరాధారులు. నిరక్షరులునగు అమితసంఖ్యాకులగు జనసామాన్యమునకు