పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/729

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
239
 


యును జరిగిన ద్వంద్వపరిపాలనము మార్చబడినదనియు, రాష్ట్రీయ స్వాతంత్ర్యమనగా ఇదియే అనుకొనుట తప్పు. ఇది నిజమైన రాష్ట్రీయ స్వాతంత్ర్యమగునా కాదా యని చూచుటలో ప్రజాప్రభుత్వ పద్ధతిగల పరిపాలనము స్థాపింపబడినదా శాససనిర్మాణమందు ద్రవ్యవ్యవహారములందు ప్రజాప్రతినిధుల శాసనసభలకు సంపూర్ణాధికార మివ్వబడినదా అను విషయములనే మనము జాగ్రత్తగా గమనింపవలెను.

ఈక్రొత్తరాజ్యాంగ మిట్టిమార్పును కలుగజేసి యుండలేదు. నిజమునకు క్రొత్తరాజ్యాంగము గవర్నరుల నిరంకుశాధికారములను మరింత స్పష్టముగ నిర్వచించి శాసనసభల స్థితిని మఱింత అధోగతిలోనికి తెచ్చినది. ఇదివరకుకన్న నికముందు గవర్నరులు మరింత నిరంకుశముగా పరిపాలింప గలుగుదురు. స్వతంత్రాధికారము లేమైననున్నచో నవి ప్రజాప్రతి నిధులకు గాక గవర్నరులకే ఒనగబడినవి.

II

రాష్ట్రీయ శాసననిర్మాణ సంస్థలు :

.

ప్రతిరాష్ట్రమునందును ప్రజా ప్రతినిధుల శాసన నిర్మాణసభయగు లెజిస్లేటివు అసెంబ్లీ యొకటి యుండును. అయితే ముఖ్యమైన ఆరురాష్ట్రములలో అనగా బొంబాయి, మద్రాసు, బెంగాలు, సంయుక్తపరగణాలు, బీహారు, అస్సాము రాష్ట్రములలో అసెంబ్లీసభతో పాటు లెజిస్లేటివు కౌన్సిలు అనబడు రెండవశాసనసభ యొకటియుండును. ఈపై సభకు