బ్రిటీష్‌రాజ్యతంత్రము
237
బడినది. 50 వ శెక్షను అతనికి సలహానిచ్చి సమయముచేయుట కొక మంత్రుల సభను నిర్మించుచున్నది. అయితే గవర్నరుయొక్క స్వతంత్రనివేచన నుపయోగించవలసిన వ్యవహారములనుగూర్చి వీరతనికి సలహానిచ్చుటకుగూడ వీలులేకుండ చేయబడినది. 51 వ శెక్షనునుబట్టి ఈమంత్రులు, గవర్నరువలననే పేర్కొనబడి అతనివలననే నియమింపబడి అతనిచిత్తము వచ్చినంత కాలమే ఉద్యోగమున నుండునట్లు శాసింపబడినది. 52వ శెక్షను గవర్నరుయొక్క ప్రత్యేక బాధ్యతగల అధికారమండలములను వివరించుచున్నది. శాంతి, భద్రతలు, అల్పసంఖ్యాకులు, ప్రభుత్వోద్యోగులు, సంస్థానములు, బ్రిటీషువర్తకులు గవర్నరుజనరలు ఆజ్ఞలు మినహాయింపబడిన ప్రదేశములు. సింధురాష్ట్రమున సుక్కూరు బారేజి అనకట్ట మధ్యరాష్ట్రము లందు బేరారు ఈ విషయములందు గవర్నరు మంత్రులతో ఆలోచించునుగాని కార్యాచరణమున తసస్వబుద్ధినే ఉపయోగించును. అనగా మంత్రుల సలహాను త్రోసివేయవచ్చును. ప్రజాప్రభుత్వ పద్ధతుల ప్రకారము పరిపాలన జరుగునని రాజ్యంగనాటకము నాడుట కుపయోగింపబడు రాజనిర్దేశ పత్రము[1] ( Instrument of instructions) అనగా గవర్న
- ↑ రాజనిర్దేశపత్రము (Instrument of instructions) యొక్క 7వ పేరాలో శాసనసభలో దృఢమైన (మోజారిటీ) ఆధికసంఖ్యాక పక్షమును గలిగిన రాజకీయనాయకునితో సంప్రతించి శాసనసభ విశ్వాసమునకు పాత్రులగువారిని మంత్రివరముగ నేర్పాటు చేయవలెననియు సాధ్యమైనంతవరకు మైనారిటీలకు అనగా అల్పసంఖ్యాక జనసంఘములకు గూడ మంత్రిసభలో ప్రాతినిధ్య మొసగబడునట్లు కనిపెట్టవలెననియు గవర్నరుకు సూచనచేయబడినది. 8వ పేరాలో గవర్నరులు తమస్వతంత్రవివేచన నుపయోగించి జరుపు వ్యవహారములలో తప్ప మిగిలినవ్యవహారములలో మంత్రులుచెప్పిన సలహాప్రకారమే జరుపవలెననియు, అయితే వారిసలహాప్రకారము నడచుకొనినచో తనకుగల ప్రత్యేకబాధ్యతలకు భంగముకలుగునని తోచినచో వారిసలహాను త్రోసివేయవచ్చుననియు చెప్పబడిది. మఱియు గవర్నరు తన ప్రత్యేకాధికారములను బహుజాగ్రత్తగా ఉపయోగించవలెననియు, సాధ్యమైనంతవరకు వానితో నిమిత్తము లేకుండ నుండునట్లుగా ప్రవర్తింప వలెననియు సూచింపబడినది. ఇట్టిస్థితిలో కాంగ్రెసు మంత్రిపదవులను స్వీకరింపదలపగా ఈచట్టములోనినిబంధనలు, ఈ రాజనిర్దేశపత్రములోని నూచనలు ఆచరణరూపమున జూపవలసివచ్చునప్పటికి గవర్నరులు కాంగ్రెసునాయకులతో ఆంతర్యమునిచ్చి సంప్రతింపక పోవుటయు, సామాన్య పరిపాలనమైనను మంత్రుల సలహాతోనే చేయుదుమని వాగ్దానము చేయకపోవుటయు తటస్థించినది. అంతటితో పోవక చట్టమునకు రాజనిర్దేశ పత్రమునకుగూడ విరుద్దముగా మైనారిటీ పక్షములలోనుండి మధ్యాంతరీయ (ఇంటరిం) మంత్రులను నియమించుట గూడ జరిగినది. అందువలననే సామాన్యపరిపాలనమైనను మంత్రులసలహా ప్రకారము ప్రజా ప్రతినిధుల యిష్టానుసారము జరుగురాజ్యాంగ మర్యాద ఏర్పడుట ఆత్యంతావశ్యక మైనది.