Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/726

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

భారతదేశమున


నుండును. శాసన నిర్మాణము, విచక్షణలు, నిరోధములు, ద్రవ్యవిషయములు, అప్పులు తెచ్చుట, బర్మారైల్వేబోర్డు, బర్మా ప్రభుత్వోద్యోగముల విషయమున బర్మాగవర్నరుకు గల అధికారములన్నియు ఆయావిషయములం డిండియాలో గవర్నరుజనరలుకు గలట్టివే. బర్మా బ్రిటిషువారు తమలాభము కొర కుపయోగించుకొను ఒక వలసరాజ్యముగా చేయబడినది.

1935 సం॥ ఇండియా రాజ్యాంగ చట్టము మనలను ఐరోపా మహాసంగ్రామమునాటికి పూర్వముండిన రోజులకు తీసికొని పోవుచున్నది. 1919వ సంవత్సరపుచట్టముక్రింద నియమింపబడిన గవర్నరుజనరలుకన్న ఈక్రొత్త చట్టముక్రింద నియమింపబడిన యతనికి హెచ్చు అధికారము లుండును. 1919వ నాటి ద్వంద్వపరిపాలనము డయార్కీ క్రింద గవర్నరుకుండిన అధికారముకన్న ఈక్రొత్తరాష్ట్రీయ స్వపరిపాలనములోని గవర్నరు కధికనిరంకుశాధికారములు కలవు.

తొమ్మిదవ పరిచ్ఛేదము : “రాష్ట్రీయ స్వపరిపాలనము”

I

ఇండియారాజ్యాంగచట్టముయొక్క మూడవభాగమున రాష్ట్రీయ స్వపరిపాలన మనబడు ప్రణాళిక విపరింపబడినది. చట్టములోని నిబంధనలను జూచినచో నిది రాష్ట్రీయ స్వపరిపాలనముగాక గవర్నరుయొక్క నిరంకుశపరిపాలనమే యని తేలును. 40 వ శెక్షనుప్రకారము రాష్ట్రముయొక్క (కార్య నిర్వాహక) పరిపాలనాధికారము గవర్నరునందు నెలకొల్ప