పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

235


కలవు. అందరికిని విదితమైన కారణములనుబట్టి భారతదేశ రాష్ట్రముల కివ్వబడిన అల్పపు రాష్ట్రీయస్వాతంత్ర్యము సైతము బర్మా కివ్వబడలేదు. 323వ శెక్షను గవర్నరుకు సలహా నిచ్చు ఒక మంత్రిసభను నిర్మించుచున్నదిగాని ఆమంత్రులు గవర్నరుయొక్క స్వతంత్ర వివేచనకు సంబంధించినట్టి విషయములందును ప్రత్యేకబాధ్యతలకు సంబంధించినట్టి విషయములందును సలహానిచ్చుటకు వీలులేదు. మంత్రులను పేర్కొనుట, నియమించుట, తొలగించుట, వారిజీతములు నిర్ణయించుట - గవర్నరుచిత్తానుసారముగ స్వతంత్రవివేచనతో జరుగవలసినవే యని 324వ శెక్షను విధించుచున్నది. ఈమంత్రు లితనిచేతులలోనికీలుబొమ్మలు. 325వ సెక్షను అతనిస్వతంత్ర వివేచనకు సంబంధించినవిషయములను వివరించుచున్నది. దేశరక్షణ, క్రైస్తవమతము, మినహాయింపబడిన ప్రదేశములు (ఇవన్నియు ముఖ్యముగా ఖనిజసంపదయున్న ప్రదేశములే) ద్రవ్యపద్ధతి, విదేశవ్యవహారములు, బర్మాకును తక్కిన అధినివేశములకునుగల సంబంధములు. గవర్నరు ఈ కార్యములకొఱకు ముగ్గురు 'కౌన్సెలర్ల'ను నియమించును. మఱియు ద్రవ్యసంబంధవిషయములకొర కొక అడ్వైజరునుగూడ నియమించును. వీరందరు నతనికి బాధ్యులుగ నుందురు. 326వ సెక్షను గవర్నరుయొక్క ప్రత్యేకబాధ్యతలను వివరించుచున్నది. ఇవి యిండియా గవర్నరుజనరలుకున్న బాధ్యతల వంటివే. గవర్నరు తన స్వతంత్ర వివేచనకు సంబంధించిన విషయములలో రాజ్యాంగ కార్యదర్శి అధికారముక్రింద