Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

భారతదేశమున


విషయములోకూడ ఈవిధానమునే యవలంబించినారు. ప్రత్తిపంటకు చౌకగాను వరిసాగుకు ప్రియముగాను నీటితీరువ నిర్ణయింపబడినది. సింధురాష్ట్రములో కొన్నికోట్ల రూపాయిల పెట్టుబడితో నొకబ్రిటీషు వర్తక సమ్మేళన సంస్థ స్థాపింపబడి అనేక ఫ్యాక్టరీలను లేవదీసి దేశములోని ప్రజోపయుక్త సేవలనెల్ల ఇజారాపొందు ప్రయత్నములు జరుగుచున్నట్లుకూడ వదంతులు ప్రబలినవి. నిజముగా సింధురాష్ట్రము బ్రిటీషు వర్తకుల లాభముకొరకే విడదీయబడినది.

బర్మా దేశము:

46 వ శెక్షనుప్రకారము బర్మాదేశముకూడా మన ప్రభుత్వమునుండి వేరుచేయబడినది. బర్మాలోగల ఖనిజసంపదను బిటీషువారు తనరఫు చేసికొనుటకు పూర్ణావకాశము లుండుటకొరకే ఇట్లు వేరుచేయబడినది. బర్మాను బ్రిటీషువారు స్వప్రయోజనముకొరకు వినియోగించుటకు వీలుండునట్లు చట్టమునం దనేక కట్టుదిట్టములు చేయబడినవి. 321 వ శెక్షను బర్మాయొక్క (పరిపాలన) కార్యనిర్వహణాధికారమెల్ల గవర్నరునందు నెలకొల్పినది. ఈచట్టమునందు చెప్పబడిన అధికారములు కర్తవ్యములు మాత్రమేగాక, ఆంగ్లరాజుయొక్క చిత్తప్రకార మొసగబడు ఇతర అధికారములుకూడ గవర్నరునకుండునట! 321 వ శెక్షనుయొక్క 2 వ ఉపవిధిప్రకారము ఈఇతరఅధికారము లనునవి చట్టములో చెప్పబడిన హద్దులకు లోబడి చలాయింపబడునవికావు. భారతీయగవర్నరు జనరలుకన్నగూడ ఈబర్మాగవర్నరుకు అధికాధికారములు