పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

233


చేయుచు పెట్టుబడులు పెట్టియున్నారు. వీరి క్షేమమునుగూర్చి ఇండియాచట్ట మేమియు చెప్పుటలేదు. ఇండియారాజ్యాంగము నిర్మించుటలో నిచ్చటబ్రిటీషువారికి గలహక్కులవిషయములో శ్రద్దవహించినట్లు ఏడెనులోని భారతీయులహక్కులనుగూర్చి ఏల శ్రద్ధవహింపరో!

సింధు రాష్ట్రము:

289 వ శెక్షను ప్రకారము బొంబాయిరాజధానినుండి సింధురాష్ట్రము వేరుచేయబడినది. పైకి మహమ్మదీయులపక్షము వారి కోర్కెలను దీర్చుటకే ఇట్లు విడదీయబడినట్లు కనబడును. కాని నిజముగా దీనిని విడదీయుటలో బ్రిటిషువారి యుద్దేశము వేరు. ఈ ఆర్థిక దుస్థితిలో సింధురాష్ట్రములోని భూ ఖామందులవద్ద నుండియు, రైతులవద్ద నుండియు వేలకొలది యెకరముల భూమిని అతిచౌకధరలకు బ్రిటీషువర్తకులు పెట్టుబడిదారులు కొనివేసినారు; ఇంకను కొనుచున్నారు. వారి యుద్దేశము, ఈసింధురాష్ట్రమును ఇంగ్లాండు వర్తకమునకు పట్టుకొమ్మగా జేసికొనవలెననియే. సింధురాష్ట్రమున విరివిగా ప్రత్తిని పండించి దానిని ఇంగ్లాండునకు పంపి అచ్చటినూలుపరిశ్రమకు తోడ్పడ గలందులకు వలసిన ప్రయత్నములెల్ల బ్రిటీషువర్తకులతోపాటు మన ప్రభుత్వమువారుకూడ చేయుచున్నారు. పల్లపువరిసాగుపైన హెచ్చుపన్ను విధించుచు దానికి బదులుగా ప్రత్తిపంటను వేసినచో తక్కువపన్ను విధించుచు ప్రత్తిపంటను ప్రోత్సహించు చున్నారు. సుక్కూరు బారేజి అనబడు ఆనకట్టనుండి నీటి సరఫరా