Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/722

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

భారతదేశమున


యొక్క లేక చక్రవర్తి జారీచేసిన ఆర్డర్ ఇన్‌కవున్సిలుయొక్క లేదా సంస్థానము ఫెడరేషనుతో చేసికొనిన ఒడంబడిక యొక్క అర్థాస్వయమును గూర్చినదైయుండవలెను.

దేశములోని హైకోర్టు తీర్మానించిన వివాదలందు రాజ్యాంగచట్టములేదా ఆర్డర్ ఇన్ కవున్సిల్ యొక్క అర్థాన్వయమును గూర్చిన న్యాయశాస్త్రాంశ మేదైన నున్నదని ఆహైకోర్టులు నిర్ణయించినచో వాని తీర్పులపైన ఫెడరల్‌కోర్టు అప్పీళ్ళను విచారించుట కధికారము కలదు. కేంద్రశాసన సభలు చట్టముద్వారా కొన్ని పెద్ద సివిలుదావాలలో హైకోర్టు తీర్పులపైన ఫెడరల్ కోర్టుకు అప్పీళ్ళను విచారించు అధికార మొసగవచ్చును. అట్టి విషయములందు హైకోర్టు తీర్పులపైన ప్రీవీ కవున్సిలుకు అప్పీళ్లుతీసికొనిపోవు అధికారము తీసివేయవచ్చును. సంస్థానములందలి హైకోర్టులు చేసిన తీర్పులందు చట్టమును గూర్చినట్టి లేదా ఆర్డర్ ఇన్ కవున్సిలును గూర్చినట్టి అర్థాశ్వయమునందు పొరబాటున్నదను కారణమున ఫెడరలు కోర్టుకు అప్పీలు చేయవచ్చును. ఫెడరలు కోర్టుతీర్పులపైన ఇంగ్లాండులోని ప్రీవీకవున్సిలుకు అప్పీలుండును,

VI

288 వ సెక్షనుప్రకారము ఏడెను మనదేశ ప్రభుత్వము నుండి వేరుచేయబడి ఇంగ్లాండులోని కాలనీల కార్యదర్శికి వశపరచబడును. ఇది పూర్వము బొంబాయి రాజధానిక్రింద నుండగా దానిని వృద్ధిచేయుటకు మన సొమ్మెంతో వ్యయము చేయబడినది. అందనేక భారతీయులు వలస నెలకొని వర్తకము