పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

231


తమకిచ్చవచ్చినంతపైకముతీసికొందురన్నమాట. 281వ సెక్షను, నేడు రాజ్యాంగ కార్యదర్శిక్రింద బనిచేయు శాశ్వత సిబ్బందినెల్ల ఇకముందు అతని కార్యాలయశాఖక్రిందకి మార్చుచున్నది. అయితే యీ మార్పుకు ముందుగా వారి కివ్వవలసిన పింఛనులు, అదనపు అలవెన్సులు, నష్టపరిహారములు, పనిచాలించుకొనునప్పుడిచ్చు రిటైరింగు అలవెన్సులు, యినాముగా నిచ్చు ఉపకార వేతనములు కలిసిన సొమ్ములో కొంతభాగము మన రివిన్యూనుండి భరించవలెను.

V

ఫెడరల్ కోర్టు

కేంద్రమున స్థాపింపబడు ఫెడరల్ ప్రభుత్వమునకును వివిధ రాష్ట్రములకును, సంస్థానములకును మధ్యవచ్చుతగవులు పరిష్కరించుటకును, రాజ్యాంగధర్మమునుగూర్చి గవర్నరుజనర లే దైనను సలహా అడిగినచో అట్టి సలహానిచ్చుటకును, రాజ్యాంగ చట్టము యొక్క 9 వ భాగము 200-218 శెక్షను ఒక ఫెడరల్ కోర్టును స్థాపించుచున్నది. ఇది 1937 వ సంవత్సరము అక్టోబరు 1 వ తేదీనుండి అమలులోనికి వచ్చినది.

ఈకోర్టుకు ఒక ప్రధానన్యాయాధిపతిని ఇరువురు సామాన్యన్యాయాధిపతులను ఆంగ్ల చక్రవర్తియే నియమించును. ఈకోర్టువారు సాధారణముగా ఢిల్లీలో సమావేశమై పరివేష్టింతురు. ఫెడరేషనుకు రాష్ట్రములకు సంస్థానములకు మధ్య ఏదైన ఒకహక్కునుగూర్చిన తగవును ఈకోర్టుపరిష్కరించును. అయితే సంస్థానముకు సంబంధించినంతవరకు ఆతగవు చట్టము