పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

భారతదేశమున


అతనిక్రింద పనిచేయవలసిన సివిలుఉద్యోగి ఆపనినిచేయక అవిధేయుడైననుగూడ ఆమంత్రి యాతనిని దండింపజాలడు, మందలింపలేడు, పనిలోనుండి తీసివేయలేడు. ఇక మన కీయబడిన రాష్ట్రీయస్వాతంత్ర్యమనునది యేమిటో ఊహింవుడు.. 244 వ శెక్షను ప్రకారము గవర్నరు జనరలు స్వతంత్ర వివేచన నుపయోగించవలసిన విషయములను నిర్వహించుటలో పనిచేయుటకు రాజ్యాంగకార్యదర్శి తగినవారిని నియమించు నధికారము కలిగియున్నాడు. సహజముగా ఈ యుద్యోగములందు ఇంగ్లీషువారే నియమింపబడుదురు. ఈక్రొత్తఉద్యోగములు, మనబంధముల నింకను బిగియించుటయే గాక మన వ్యయభారము నింకను భరింపశక్యము కానిదిగ జేయును. 272 వ శెక్షను ఆర్థికరీత్యా చాలా అన్యాయమైనది. శాశ్వతముగా హిందూదేశమువెలుపల నివసించు బ్రిటీషు పింఛనుదారులకు చెల్లించు ఉపకార వేతనములును వారివిషయములో చెల్లించవలసిన పింఛనుమొత్తములును, ఇండియా దేశపు పన్నులకులోబడవట!

ఇంగ్లాండులోని ఇండియా ఆఫీసు ఖర్చులలో కొంతభాగము ఇండియా దేశాదాయములోనుండి చెల్లించవలసినట్లు 280వ శెక్షను విధించుచున్నది. ఇండియాఆఫీసు, మనఫెడరేషను తరఫున చేయుపనులకొరకే యట యీ వ్యయమును మనము భరించవలసినది! ఈవ్యయవు మొత్తమును బ్రిటీషు కోశశాఖ వారును, గవర్నరుజనరలును కలిసి ఆలోచించి నిర్ణయింతురట. అనగా ఇంగ్లీషువారు మనరివిన్యూనుండి యీ పేరున