Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

229


చేయవలెనన్నచో భారతీయాభ్యర్థులు ఇంగ్లాండుకు పయనమై వ్యయప్రయాసలకు లోను కావలసియుండును. భారతీయ మంత్రులు తమ సేవకులగు ఐ. సి. ఎస్. ఉద్యోగులను పనిలోనుండి తోలగింపలేరు. (240వ సెక్షనులో ఆయుద్యోగులను నియమించిన హోదాగల అధికారులకు తక్కువహోదాగల అధికారులు వారిని తొలగింపవీలులేదని శాసింపబడినది.) ఒక మంత్రి యొక ఐ. సి. ఎస్. ఉద్యోగిని దండించినగాని మందలించినగాని అతని ఉద్యోగషరతులనుబట్టి యతనికి గల అవకాశములకు నష్టకరముగా నుండునట్లు ఏనిబంధననుగాని మార్చినయెడలను, అతనికి పూర్తియగు ఉపకారవేతనము లభించు కాలపరిమితిలోపుగా అతనిపదవిని తీసివేసినను, ఈమంత్రితీర్పుపైన ఆయుద్యోగి అపీలు చేసుకొనవచ్చునని 241 వ శెక్షను శాసించుచున్నది. 247 వ శెక్షను ఈ ఐ. సి. ఎస్. ఉద్యోగుల జీతమునుగూర్చియు సెలవునుగూర్చియు ఉపకారవేతనమునుగూర్చియు మఱియు వారియొక్క ఇతరహక్కులనుగూర్చియు నిబంధనలను చేయుటకు రాజ్యాంగ కార్యదర్శికే అధికారమిచ్చుచున్నది. ఈ శెక్షనుపర్యవసానమేమనగా భారతీయ ప్రజాప్రతినిధులు ఏ పదవియందైననుండి ప్రజాసేవ చేయవలెనని తలచిననుగూడ ఆయా పదవులక్రింద స్థిర సేవకులుగా నిలిపియుంచబడిన ఈ ఐ. సి. ఎస్. ఉద్యోగులు, మన ప్రజాప్రతినిధులకన్న బలవంతులై వారికి ఆటంకములు కలిగించుచునేయుందురు. ఒక భారతీయమంత్రి చేయదలచిన కార్యముయొక్క రాజకీయపరిణామము భారతీయులకు క్షేమకరమును, బ్రిటీషువారికి సష్టకరము నైనచో