226
భారతదేశమున
లంబించి తీర్మానించుటలో నాశ్చర్యమేమి? ఈ శెక్షనులోని 4 వ ఉపవిధి ఈరైల్వే ఆధారిటీని ఫెడరలు ప్రభుత్వాధికారమునకుగాక గవర్నరుజనరలుయొక్క అధికారమున కే లోబడచు చున్నది. అందుకు సంబంధించినంతవరకు అతనికి సర్వాధికారములు నొసగబడినవి. అందువలన రైల్వేఅథారిటీ అతని యాజ్ఞానువర్తియై తీరవలెను. ఈరైల్వేరాజ్యము కేవలము ఇంగ్లీషుపెట్టుబడిదారులకును వారిపనివారికిని ఇంగ్లీషు ఇనుప వ్యాపారులకును ఇజారా భూమిగా చేయుటకును, ఇంగ్లీషు సరకులను విరివిగా దేశములోనికి ప్రవేశపెట్టుటకును వీలుకలిగించవలెనను ఉద్దేశముతోనే ఈ నిబంధనలెల్ల చేయబడినవిగాని వేరుకాదు. ఇందుకొరకే రైల్వేఅథారిటీ పైన మన ప్రజాప్రతినిధుల కెట్టి పలుకుబడియు లేకుండచేయబడి బ్రిటిషువారి హక్కులనెల్ల చిరస్థాయిగా నుంచి కాపాడగల సర్వాధికారములు గవర్నరు జనరలున కీయబడినవి. 8 వ షెడ్యూలుయొక్క 12 వ ఉపవిధినిబట్టి కేంద్రరాష్ట్రీయ శాసన సభలందు గత 12 నెలలలోపుగా సభ్యులుగ నుండినవా రెవ్వరును ఫెడరలు రైల్వే అథారిటీలో సభ్యులుగానుండరాదని శాసింపబడుటయు కూడ నిందుకొరకే. 192 వ సెక్షనుప్రకారము గవర్నరుజనరలు శిఫారసుపైనతప్ప ఫెడరలు శాసనసభలు ఏరైలుదారిపైనను కేవులను రేట్లను మార్చుటకు వీలులేదు. ఇండియాలోని రైల్వేకంపెనీలకు డైరెక్టర్లను, డిప్యూటీడైరెక్టర్లను నియమించు అధికారము 199 వ శెక్షనునుబట్టి గవర్నరుజనరలున కే గలదు.