బ్రిటీష్‌రాజ్యతంత్రము
225
ముగా మన పరిశ్రమలకు వ్యతిరేకముగాను, వారిపరిశ్రమలకు వీలుగాను పరిపాలన జరుగుననుటలో నాశ్చర్యమేమి ! రైళ్ళ సామగ్రికి కేంద్ర ప్రభుత్వమువా రేటేట రమారమి 30 కోట్ల రూపాయలు ఖర్చుచేయుచున్నారు. ఈ వ్యయమింకను వృద్ధిగాగలదు. ఈ మొత్తము దేశీయపరిశ్రమలను వృద్ధిచేయుట కుపయోగించవచ్చునుకదా ! అయితే 183 వ శెక్షనులోని సూచనలనుబట్టి ఆమొత్తము అట్లు వినియోగింపబడు లక్షణములు గానరావు. రైల్వే ఆధారిటీవారు వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యము, మఱియు ప్రజలయొక్క క్షేనుము నాలోచించి, వ్యాపారధర్మములను (Business Principles) గూడ అనుసరించి తమకర్తవ్యమును నిర్వర్తించవలెనని ఆ శెక్షను శాసించుచున్నది. "వ్యాపారధర్మములు” అనుమాటకు గల అంతరార్థము, “బిటిషువస్తువులనే కొనుడు" అనుసూత్రము ననుసరించి బిటీషువస్తువులనే ప్రజలు కొనునట్లు చేయగల రవాణా కేవుల పద్ధతులను నిర్ణయించవలసినదనియే. కార్యాచరణ నీతివిధాసములందు రైల్వే అథారిటీ ఫెడరలు ప్రభుత్వముయొక్క సలహాననుసరించి నడుపవలెనని యున్నను, ఒక వ్యవహార మట్టినీతికి సంబంధించినదగునా కాదా యని ఉభయసంస్థలకు తగాదా వచ్చినచో దానిపైన గవర్నరుజనరలు తీర్మానమే తిరుగులేని కట్టకడపటి నిర్ణయమనియు విధింపబడినది. బ్రిటీషుశ్రేయము, భారతీయ క్షేమమునకు వ్యతిరేకముగనున్న సందర్భములో ఆతగవులు తీర్మానించుటలో గవర్నరుజనరలు సహజముగా బ్రిటీషుపక్షమునే యవ