224
భారతదేశమున
ఆకంపెనీలవారును ఆకంపెనీల కంట్రాక్టరులు నని వేరుగా చెప్పవలెనా?
182 వ శెక్షను ప్రకారము ఈనూతన అధికారసంస్థలో 7 మందికి ముగ్గురుచొప్పున సభ్యులను, వారిసభాపతిని గూడ గవర్నరుజనరలే నియమించవచ్చును. 8 వ షెడ్యూలు యొక్క 1 వ శెక్షను ప్రకారము ప్రస్తుతము గవర్నరుజనరలు ఈరైల్వే అధారిటీలోని అందరి సభ్యులను గూడ నియమించుట కధికారమీయబడినది. ఫెడరలు శాసనసభ ఈ షెడ్యూలును పై విధముగా మార్పుచేయవలెనన్నచో గవర్నరు జనరలు యొక్క అనుమతిని ముందుగా పొందవలెను. ఈ అధారిటీలో అన్నివిషయములు మెజారిటీవోట్ల తీర్మానము ప్రకారము పరిష్కరింపబడును. (8వ షెడ్యూలు 6వ విధి) అందువల్ల గవర్నరు జనరలుయొక్క మనుష్యులే అనగా బ్రిటిషువారిశ్రేయము గోరువారే దీనిలో హెచ్చుపలుకుబడిని కలిగియుందురు. మన రైల్వేపాలనము పరాయివారి పెత్తనముక్రింద చేయబడుట వలన చాలా అనర్థకములు కలవు. సరకులరవాణాలో మనసరకులకు హెచ్చు కేవులను విదేశీయ సరకులకు అతిచౌక కేవులను నిర్ణయించి మన వ్యాపారమునకు ఆటంకములు కలిగించు చుండవచ్చును. ఇక ఇంజనులు, రైలుబండ్లు ఇతర యినుప సామానులు, ఉక్కు సామానులు విరివిగా ఉపయోగించునది రైళ్ళవారే. అందువలన మన ఇనుప ఉక్కు పరిశ్రమలను వృద్ధి చేయవలెనన్నచో రైళ్ళపరిపాలన మనకు అనుకూలమైనదిగా నుండవలెను. అందు బ్రిటీషుపక్షపాతులే యున్నచో సహజ