పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/713

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
223
 


వారిసౌఖ్యముకొర కేర్పడిన ఇటువంటి అనవసరపు ఉద్యోగములు నిర్మింపబడుటకు గల కారణము. మనసొమ్మును వాడునప్పుడు, మన ఇంగ్లీషుప్రభువులు సామాన్యపు పొదుపును గూడ గమనింపరు. ఈదరిద్రభూమికి చౌకయగు పరిపాలనా పద్ధతులత్యంతావశ్యకములై యుండగా ఈ రాజ్యాంగ చట్టము మితిమీరిన ఖర్చులను దెచ్చిపెట్టుచున్నది.

ప్రస్తుతము అమలులోనున్న ఋణములకు పూచీలు, ఇతరబాధ్యతలు, ఫెడరేషను భరించి తీరవలెనని 178 వ సెక్షను శాసించుచున్నది. 729 కోట్లరూపాయిలు ఋణము మనము భరించనక్కరలే దని కాంగ్రెసువా రుద్ఘోషించినందున బ్రిటీషువారీ సెక్షనుద్వారా తగుజాగ్రత్తను దీసికొనినారు.

ఫెడరలురైల్వే అథారిటీ :

చట్టముయొక్క 8 వ భాగము ఫెడరల్ రైల్వే అధారిటీకి సంబంధించినది. రైల్వేలను నిర్మించుట, భరించుట, నడుపుట, కట్టుదిట్టపరచుట, ఈక్రొత్తఅధికారసంస్థక్రిందనుండును. ఫెడరలురైల్వేల విషయములో ఏ కార్యభారముగానివహించుట యవసరమని వీరు తలచినచో అందుకు వలసిన సర్వాధికారములును వీరికుండును. ఆసందర్భములో ఇతరులతో ఏవైన ఏర్పాటులు చేయుట అవసరమని తోచినచో అట్టి ఏర్పాటులు చేయుటకును, వీరికధికారముండును. ఈశెక్షనులోగూఢముగా చెప్పబడిన “ఇతరులు" అనునది బ్రిటీషురైళ్ల కంపెనీలవారు