Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

47


న్నవి. వరిపంట చాలాచక్కగానున్నది. ప్రత్తి విరుగబండినది. చెరుకుపంట సమృద్ధిగానున్నది. అనేక చెరుకు గానుగలుండుటయే ఈ దేశము యొక్క సంపదకు సాక్షి . జనసంఖ్య హెచ్చుగా లేదుగాని గ్రామములు మంచి స్థితిలో నున్నవి. కంపెనీవారి భూముల స్థితినిబట్టి చూడగా రాజపుత్రస్థానము నందట్టి సంపద కనబడుట నాకాశ్చర్యకరముగా నున్నది. భరతపుర సంస్థానాధీశుడు చాలసమర్థుడును ప్రజానురంజకుడగు పరిపాలకుడునై యుండవలె. లేదా మన బ్రిటిషు రాష్ట్రములందవలంబింపబడుచున్న పరిపాలనా విధానము నేటివుపరిపాలకుల రాజ్యములందువలె ప్రజలయభివృద్ధికి సౌఖ్యమునకు అనుకూలమైనది కాకుండునట్టిదైన గావలె నని నాకు తోచుచున్నది. ”

సతారారాజగు ప్రతాపసింహునియొక్క సుగుణముల గూర్చి అతని పాలనలోని రాజ్యముయొక్క సంపదనుగూర్చి బ్రిటిషు ప్రభుత్వమువారే పొగడియున్నారు. (1843 నెం 569, 1268 పుట) కంపెనీడైరక్టర్లు ఆ రాజుకు వ్రాసిన ఒకలేఖలో నిట్లు కలదు. “మాప్రభుత్వమునుండి మాకువచ్చుచున్న సమాచారములను బట్టి చూడగా మీవిధ్యుక్త ధర్మములను మీరెంతో చక్కగా నిర్వహించుచున్నట్లు మాకు కనబడుచున్నది. మీ పరిపాలనలో మీరాజ్యమత్యంతాభి వృద్ధిగాంచుచు మీ ప్రజలు సుఖముగా నుండుటయు మీరు అవలంబించిన చక్కని పరిపాలనా పద్దతియొక్కయు మీసత్స్వభావము యొక్కయు పరిణామముగనున్నది. మాకు చాలసంతసముకలిగించినది. ప్రజోప