216
భారతదేశమున
కైన అవకాశముండుట! నిజమునకు ఇంగ్లాండుతీరము చుట్టును ఇంగ్లీషువారు తప్ప ఇతరు లెవ్వరునుగూడ ఏఓడలు నడుపుటకును ఎట్టి అవకాశమునులేదు. ఇంగ్లాండువారే తమ నౌకావ్యాపారమును వృద్ధిచేసికొనుటలోనెన్ని నావిగేషను చట్టములను చేసికొనలేదు? ఈ సంగతిని గమనించువా రెవ్వరు?
116 వ సెక్షనుప్రకారము ఇండియాలో భారతీయ కంపెనీల కేయేధనసహాయము, ధనదానములు (గ్రాంటులు, బౌంటీలు, సబ్సిడీలు) ఒసగబడునో అట్టివి ఇంగ్లీషుకంపెనీలకుగూడ ఒసగబడవలెననియు, అధికాదరణ చూపబడవలెననియు శాసింపబడినది. (సర్వాధికారులగు గవర్నరు జనరలుల మెప్పుకొరకు) మెహర్భానీకొరకు, మనవారే, ఇంగ్లీషుకంపెనీల కివి యర్పింతు రనుటలో నాశ్చర్యమేమి కలదు?
దీనియర్థ మేమనగా, మనము స్వదేశ పరిశ్రమలను బ్రోత్సహించుట నైనను మానుకొనవలెను; లేదా వాని గొంతును నులిమి నశింపజేయు విదేశీపరిశ్రమలనుకూడ సత్కరించియైన తీరవలెను! 'పరస్పర మర్యాదల' విషయములో ఇండియాగవర్నమెంటును ఇంగ్లీషు ప్రభుత్వమును ఏదైన ఒడంబడికను చేసికొన్నచో నీభాగములోనివిధులు నిలుపుదల చేయుచు సభాయుతుడగు రాజాజ్ఞ జారీచేయబడునని 118 వ సెక్షను చెప్పుచున్నది. మనకును వారికిని న్యాయముగ నుండగల ఒడంబడిక జరుగుటయనునది గగనకుసుమము. ఈ ఘోర నిబంధనలు నిలుపుదల యగుటయు అసంభవమే.