పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

భారతదేశమున


వచ్చును. ప్రతిదేశమువారును తమ దేశముయొక్క వృత్తులు, ఉద్యోగములు, వ్యాపారములు నా దేశవాసులకే ప్రత్యేకించి యుంచుచుండగా మన దేశములో నీ విపరీతపు పద్ధతి నెలకొల్పబడుచున్నది. నేడు బ్రిటీషువారి హస్తగతమై యున్న ఆర్థికవ్యవస్థను వారిచేతులలోనుండి తప్పించుటకు మనకు వీలులేకుండ నిరోధించుచున్నది. భీమావ్యాపారము, బ్యాంకింగు, విదేశ మారకపద్ధతి, విదేశవ్యాపారము, కోస్తా ఓడలవర్తకము, నౌకావ్యాపారము, ప్రజోపయుక్త సేవలును బిటీషువారి చేతులలోని శాశ్వత యిజారా లయి యుండును. భారతీయ సంస్థలపైన బ్రిటీషువా రధికారమును సంపాదించు పద్దతియు మార్పుజెందదు. పూర్వము భారతీయుల చేతులలో నుండిన అలహాబాదు బ్యాంకును ఇంగ్లీషు ఓడల కంపెనీయగు పి. అండ్. ఓ. కంపెనీవారు కొనివేసినారు. మన దేశసంపదనెల్ల బ్రిటీషువారు తనఖా పెట్టుకొనుచున్ననుగూడ మనమేమిచేయుటకును వీలులేకుండ ఈ సెక్షను మన కాలుసేతులు కట్టివైచుచున్నది. వ్యాపార రక్షణకొరకు మన మిదివర కేదైన చర్య దీసికొన్నచో విదేశీయులు వానిని తప్పించుకొనుటకు వెంటనే ఈ దేశములోనే కంపెనీలను స్థాపించుట ప్రారంభింపసాగిరి. 'పరస్పరమర్యాద' లను నొక క్రొత్తసిద్ధాంతమును మిషగా గయికొని మన మేచర్యయు దీసికొనరాదనుచున్నారు. ఉదాహరణమునకు: ఇంగ్లాండులో మనపయిన లేనిఅడ్డంకులు వారికి మనమిచట కలిగింపరాదని శెక్షను విధించుచున్నది. నిజముగా మనదేశమునుండి ఆ దేశ