Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

భారత దేశమున


వాత నిరువదియేండ్లలో నీదేశాదాయమునందును అయోధ్యలోనిదత్తమండలములయొక్క ఆదాయమునందును సాలుకు , 20 లక్షల రూపాయలు తరుగు రాసాగెను. ఋతువులయొక్క అతివృష్టి, అనావృష్టి దోషములవలన చుట్టుప్రక్కల భూభాగములలో పంటలు పాడైపోయినప్పుడుకూడా దయారామ్ భగవత్ సింగుల రాజ్యములు సుభిక్షముగానుండి పాడిపంటలతో తులతూగు చుండెను. ఈ “చుట్టుప్రక్కల భూభాగము" లనునవి అప్పటి కై దేండ్లనుండి బ్రిటిషుప్రభుత్వమువారి స్వాధీనములో నున్న భూములు! (Bishop Heber's Journal. Vol. II. Quoted in Reform Pamphlet.)

బిషప్ హెబరు తన జర్నలులో (Vol.II. Page 77-9), సాదత్ ఆలీపరిపాలనకాలమున అయోధ్య మంచి యభివృద్ధిలో, నుండుటను పేర్కొని సాదత్ ఆలీ చాలా తెలివికలవాడనియు వ్యవహారదక్షుడనియు, విజ్ఞానశాస్త్రమన్న అతనికి ప్రీతియనియు చెప్పియున్నాడు. గవర్నరు జనరలగు హేస్టింగ్సుకూడా సాదత్ ఆలీయొక్క ధర్మవర్తనమును ఋజుగుణమును దయార్ద్రహృదయమును పొగడియుండెను.

VIII

భరతపురము

ఆనాటి నేటివు పరిపాలకులక్రింద భరతపురము చక్కగా అభివృద్ధి జెందుచుండిన సంగతి కూడా బిషప్ హెబరు వర్ణించియుండెను. “భారతదేశములో నేనుచూచినప్రదేశములలోనికెల్ల ఈ రాజ్యభాగములోని పల్లపునీటిసాగు వనరులు చాలాబాగు