పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

భారతదేశమున


ప్రాగ్దేశములందు బ్రిటిషు సామ్రాజ్య ప్రాబల్యమునకు ప్రాకులాటకు రంగస్థలముగా నుపయోగించుటకు దీనిని తమచేతిలో నుంచుకొనుటయే. ప్రతిసాలున 50 కోట్ల రూపాయలు తినుచు మనదేశము నాక్రమించియున్న బ్రిటీషు సైన్యము ఎల్లప్పుడు యుద్ధసన్నద్ధమై యుండును. దేశములో అశాంతి లేకుండ అణచుటకు బ్రిటిషువారికి విదేశములందు సహాయము చేయుటకు ఎల్లప్పుడు నిది సంసిద్ధముగా నుండును. సామాన్యముగా మనదేశముయొక్క రక్షణకు కావలసిన అవసరసైన్యముకంటె చాలా హెచ్చుసైన్యమును అపరిమిత వ్యయముతో నుంచి మన జాతీయాభివృద్ధి కావశ్యకములగు కార్యములకు గావలసిన సొమ్ము లేకుండచేయుచున్నారు. ఈసైనికవ్యయము తగ్గనంతవరకు విద్యగాని వైద్యము ప్రజారోగ్యముగాని ప్రజా క్షేమలాభములు కలిగించు ఏఇతరఫనులుగాని అభివృద్ధిజెందుట కవకాశములేదు. ఏమైనను సరియే బ్రిటీషు సామ్రాజ్య తత్వము తనసైన్యము తగ్గింపదు. బ్రిటీషు సామ్రాజ్య తత్వమునకు భారత దేశమునం దుండవలసిన సైనికబలమునం దావంతయైన తగ్గకుండ తగిన బందోబస్తును అతిజాగ్రతగా చేయుటకు గవర్నరు జనరలు తన ప్రత్యేక బాధ్యత నుపయోగించితీరును.