పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

207


ప్రాబల్యమును చిరస్థాయి యొనరించుటకు భారతీయ వర్తకమునకు, పరిశ్రమలకు, ఓడలకు ప్రత్యేకరక్షణ మొసగ వీలులేకుండ చేయుటకును నిర్మింపబడినది.

భారతదేశ స్వదేశ సంస్థానములకు సంస్థానాధీశులకు గల హక్కులను కాపాడుట కేర్పడిన ప్రత్యేకబాధ్యత బ్రిటిషుసామ్రాజ్య విధానమునకు పట్టుగొమ్మయగు సంస్థానాధీశుల జాగీర్దారీ 'ఫ్యూడలు' పద్ధతిని శాశ్వతముగా నిలిపియుంచుట కొర కేర్పడినదే.

అల్పసంఖ్యాక జనసంఘముల (మైనారిటీల) హక్కులను రక్షించుట కేర్పడిన ప్రత్యేక బాధ్యత యనునది, ఒక జనసంఘము నింకొక జనసంఘముపైన ప్రయోగించి జాతి మత ద్వేషములను కులకక్షలను వైరములను పెంపొందించుటకు గవర్నరు జనరలుచేతిలో నొక ప్రథానాయుధముగా నుపయోగించును.

సర్కారుఉద్యోగుల హక్కులను కాపాడుట కొరకేర్పడిన ప్రత్యేక బాధ్యత, ప్రజలయెడల నేమాత్రము సానుభూతిలేక ప్రవర్తించుచు అత్యధిక వ్యయహేతువులైన ఐ. సి. ఎస్. మున్నగు అధికారివర్గముయొక్క ఉక్కు చట్రము నెప్పటివలెనే యుంచుట కేర్పడినది.

దేశరక్షణ విదేశవ్యవహారములకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతయొక్క పరమరహస్యమేమన: భారతదేశ పరిపాలనకు పునాదియగు పశుబలము నెప్పటివలెనే చలాయించవలెననియు