Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

భారతదేశమున


అనుపేరున భారతదేశప్రజలు తలపెట్టునట్టి సామ్రాజ్యమునకు ప్రతికూలమగు ప్రతి ప్రయత్నము గూడ అణచి వేయబడును.

దేశద్రవ్యపద్ధతి (ఫైనాన్సు) యొక్క స్థాయిత్వము (ఆర్థిక క్షేమము) కొరకేర్పడిన బాధ్యత అనునది మనదేశముపైన వేయబడిన భరింపశక్యముగాని ఋణభారమును చిరస్థాయిగా నుంచుట కేర్చడినది. ఈ ఋణభారము ప్రభుత్వము వారిదుబారా తనమువలన నీవందసంవత్సరములలో పాపము పెరిగినట్లు పెరిగినది. ముఖ్యముగా బ్రిటిషువారి లాభముకొరకును ఆర్థికముగా మసకుపయోగింపని వ్యయములక్రిందను చాలసొమ్ము అప్పు తేబడినది. 1934 నాటికి భారతదేశప్రభుత్వము చేసినఋణము 1212 కోట్ల రూపాయలుగ నుండెను. ఇందు 512 కోట్లుఋణము ఇంగ్లండులోనే చేయబడినది. ఇది భారతదేశములో పన్నులు భరించువానిపైనబడిన గొప్పభారము! వడ్డీరూపముగా ప్రతి సాలున కోట్లకొలది చెల్లించవలసి వచ్చుచున్నాము. ఈఋణములో చాలవరకు బ్రిటీషుసామ్రాజ్యము లాభనిమిత్తమే చేయబడినందున దీనిని పరిశీలించి ఎంతవరకుమనమిచ్చుకోతగినదో నిర్ణయించవలసినదని కాంగ్రెసువారు స్పష్టముగా కోరుచున్నందున క్రొత్తరాజ్యాంగములో నీ ప్రత్యేక బాధ్యత నిర్మింపబడి బ్రిటీషు పెట్టుబడిదారుని లాభముకొరకు మనవారిపైన నీ భారము వేయబడుచున్నది.

బ్రిటీషు వర్తకముపట్ల పరిశ్రమలపట్ల విచక్షణచూపకుండగ చేయబడిన ప్రత్యేకబాధ్యత, భారతదేశఆర్థికజీవనమున బ్రిటిషు పెట్టుబడిదారుల యొక్కయు వర్తకులయొక్కయు